
బాలయ్యతో సై అంటున్న సమీరా
తెలుగు అమ్మాయి సమీరా రెడ్డికి కూడా చాలాకాలంగా ఛాన్స్‌లు కరువయ్యాయి. దాంతో ఆమె ఐటం సాంగ్స్ పై దృష్టి పెట్టింది. Balakrishna Legend movie
తెలుగు అమ్మాయి సమీరా రెడ్డికి కూడా చాలాకాలంగా ఛాన్స్‌లు కరువయ్యాయి. దీంతో క్రిష్ డైరెక్షన్‌లో వచ్చిన కృష్ణం వందే జగద్గురం సినిమాలో దగ్గుబాటి రానా సరసన సమీరా అందాలు ఆరబోసి ఆకట్టుకుంది. ఇపుడు తాజాగా బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో బాలయ్య హీరోగా వస్తున్న లేజండ్ సినిమాలో మరోసారి ఐటమ్ సాంగ్‌లో మెరవడానికి రెడీ అవుతుంది.
అయితే హీరోయిన్....లేదంటే కనీసం ఐటమ్‌బాంబ్. ఇదీ నయాట్రెండ్. హీరోయిన్‌లుగా పరిచయమైన భామలు ఛాన్స్‌లు లేకపోతే స్పెషల్ సాంగ్స్ చేసుకుని టైమ్‌పాస్ చేసుకుంటున్నారు. ఒకప్పుడు హీరోయిన్ ఐటమ్ సాంగ్ చేయాలంటే పెద్ద గగనంగా ఉండేది. ఇపుడు ట్రెండ్ మారింది. ఫామ్‌లో ఉన్న హీరోయిన్‌లు కూడా స్పెషల్ సాంగ్స్ చేస్తున్నారు.
మాస్ ప్రేక్షకులను ఆకర్షించేందుకు సినిమాలో మసాలా ఐటమ్ సాంగ్ తప్పనిసరి. ఇలాంటి ప్రత్యేక గీతం లేని సినిమా ప్రస్తుతం ఉండడం లేదు. ఫామ్‌లో ఉన్న హీరోయిన్ చేసి మాస్ మసాలాతో అందాల ఆరబోస్తే రిపీటెడ్ ప్రేక్షకులను రప్పించవచ్చేనేది సక్సెస్ మంత్రగా మారింది. అందుకే హీరోయిన్‌లు అడపాదడపా ఇలాంటి స్పెషల్ సాంగ్స్‌లో మెరిసిపోతున్నారు.
అప్పట్లో కొంతమంది డైరెక్టర్‌లు మాత్రమే ఈ స్పెషల్ సాంగ్స్‌ను వాడే వారు. హీరోయిన్‌లుగా పరిచయం అయ్యి రెండు మూడు సినిమాల తర్వాత ఛాన్స్‌లు తక్కువైతే ఐటమ్ సాంగ్‌లు చేయడానికి కూడా వెనుకాడడం లేదు ఈ భామలు. గతంలో కొమరం పులితో హీరోయిన్‌గా పరిచయమైన నికిషాపటేల్‌కు పెద్దగా అవకాశాలు రాలేదు. చాలా కాలం గ్యాప్ వచ్చింది. దీంతో తమిళంలో ఒక ఐటమ్ సాంగ్ చేయడానికి రెడీ అయింది. మరో హీరోయిన్ శృతీహాసన్ ఈ పాటకు గాత్రం అందించింది. శ్రియ కూడా ఐటం సాంగ్స్లో నర్తించిన విషయం తెలిసిందే.