బాలకృష్ణ, బోయపాటి శ్రీను
నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో బిగెస్ట్ హిట్స్‌గా నిలిచిన సింహా, లెజెండ్ సినిమాలకు దర్శకుడు బోయపాటి శ్రీను. ఇంతటి ఘనవిజయాలను అందించిన బోయపాటి దర్శకత్వంలో బాలయ్య మరో సినిమా చేయబోతున్నాడని చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. బాలయ్య కూడా బోయపాటితో సినిమా చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు. బాలయ్య వందో సినిమా బోయపాటి దర్శకత్వంలోనే చేయాల్సి ఉండగా అప్పటికే కమిట్ అయిన సినిమాల కారణంగా మిస్ అయ్యింది.
తాజాగా ఈ ఇద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా మొదలు కాబోతుందన్న వార్త ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ గా మారింది. బోయపాటి ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే బాలయ్యతో హ్యాట్రిక్ సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడు. తాజాగా సమాచారం ప‍్రకారం బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా జూన్ 10న ఈ సినిమాను ప్రారంభించాలని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment