ఆట హంసానందినితోనే! | Hamsa Nandini replaced Bipasha Basu Item Song in Legend | Sakshi
Sakshi News home page

ఆట హంసానందినితోనే!

Published Sun, Mar 2 2014 12:48 AM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

ఆట హంసానందినితోనే! - Sakshi

ఆట హంసానందినితోనే!

 బాలకృష్ణతో అండర్‌ప్లే చేయిస్తే.. దాని ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో రుచి చూపించిన చిత్రం ‘సింహా’. కోడి రామకృష్ణ, బి.గోపాల్, వి.వి.వినాయక్ తర్వాత బాలకృష్ణను అంత జనరంజకంగా చూపించింది నిజంగా బోయపాటి శ్రీనే. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటే.. అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకించి చెప్పాలా? ‘లెజెండ్’ సినిమా ప్రారంభం నుంచీ బోయపాటి చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. సినిమాను ఆయన చకచకా పూర్తి చేసిన వైనం... కథపై తనకున్న నమ్మకాన్ని తెలియజేస్తుంది. ఒక్క పాట మినహా ఈ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తయింది. ఆ ఒక్కపాటను ఈ నెల 5 నుంచి హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో వేసిన స్పెషల్ సెట్‌లో తెరకెక్కించనున్నారు. 
 
 అయితే.. బాలీవుడ్ భామ బిపాసాబసు ఈ పాటలో నర్తిస్తున్నట్లు వార్తలొచ్చాయి. అది నిజం కాదట. ఈ ప్రత్యేకగీతంలో బాలయ్యతో కాలు కదిపే తార హంసానందిని. ప్రేమ్క్ష్రిత్ నృత్యరీతుల్ని సమకూరుస్తున్న ఈ పాటలో హంసానందినితో పాటు ఈ చిత్ర కథానాయికల్లో ఒకరైన సోనాలీ చౌహాన్, మరికొందరు తారాగణం కూడా పాల్గొంటారు. దేవిశ్రీప్రసాద్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను ఈ నెల 7న విడుదల చేసి, సినిమాను ఈ నెల 28న విడుదల చేయనున్నారు నిర్మాతలు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర. రాధికా ఆప్టే ఓ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు విలన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆయనకు జోడీగా కల్యాణి నటిస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: సాయి కొర్రపాటి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement