
లైగర్ భామ అనన్య పాండే గురించి పరిచయం అక్కర్లేదు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన నటించింది. కానీ ఊహించని విధంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఆమె హిందీ సినిమాలతో బిజీగా ఉంది.
కాగా.. గతేడాది అనన్య పాండే కజిన్ సిస్టర్ అలన్నా పాండే వివాహాబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. మార్చి 2023లో తన ప్రియుడు ఐవోర్ మెక్ క్రేను పెళ్లాడింది. ముంబయిలో జరిగిన ఈ వేడుకలో సన్నిహితులు, కుటుంబసభ్యుల సమక్షంలో ఈ జంట ఒక్కటయ్యారు. తాజాగా అలన్నా పాండే గర్భం ధరించినట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టా ద్వారా పంచుకుంది. బేబీ బంప్‌తో ఉన్న వీడియోను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీతారలు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. అనన్య తల్లి భావన పాండే సైతం శుభాకాంక్షలు తెలిపింది.
అలన్నా, ఐవర్ వివాహం
అనన్య పాండే తండ్రి చుంకీ పాండే సోదరుడు చిక్కి పాండే కుమార్తె అయిన అలన్నా.. తన ప్రియుడు ఐవోర్ మెక్‌క్రేని వివాహం చేసుకుంది. ఈ వివాహానికి షారూఖ్ ఖాన్, గౌరీ ఖాన్‌తో సహా పలువురు బీ టౌన్ ప్రముఖులు హాజరయ్యారు. కొన్నేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న ఈ జంట గతేడాది వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. కాగా.. ఐవోర్ ఒక అమెరికన్ దర్శకుడు, ఫోటోగ్రాఫర్‌గా రాణిస్తున్నారు. కాగా.. గతంలో వీరిద్దరు మాల్దీవుల్లో నిశ్చితార్థం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment