స్టార్ హీరోయిన్‌కు ప్రెగ్నెన్సీ.. అఫీషియల్‌గా ప్రకటించిన దంపతులు! | Deepika Padukone And Ranveer Singh Announced They Are Welcome Baby In September, Post Goes Viral - Sakshi
Sakshi News home page

Deepika Padukone Pregnancy, Delivery Date: 'అవును.. ఊహించిందే జరిగింది'.. ప్రెగ్నెన్సీ ప్రకటించిన దీపికా పదుకొణె!

Published Thu, Feb 29 2024 10:37 AM | Last Updated on Thu, Feb 29 2024 11:12 AM

Deepika Padukone and Ranveer Singh announce they are welcome baby in September - Sakshi

బాలీవుడ్ స్టార్ మోస్ట్ క్రేజ్ ఉన్న కపుల్  దీపికా పదుకొణె, రణ్‌వీర్‌ సింగ్. ఈ జంటపై కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో రూమర్స్ వస్తున్నాయి. ఈ ఏడాదిలో వీరిద్దరు తల్లిదండ్రులు కాబోతున్నట్లు నెట్టింట టాక్ వినిపించింది. ఇటీవల బాఫ్టా వేడుకల్లో పాల్గొన్న దీపికా పదుకొణె చీరకట్టులో కనిపించింది. ఆ తర్వాత దీపికా వదులుగా ఉండే ఔట్‌ఫిట్‌లో కనిపించింది. దీంతో దీపిక ప్రెగ్నెన్నీతో ఉందంటూ సోషల్ మీడియాలో వైరలైంది.

తాజాగా అందరూ ఊహించినట్లుగానే అభిమానులకు గుడ్‌ న్యూస్ చెప్పింది బాలీవుడ్ జంట. దీపికా పదుకొణె ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని బాలీవుడ్ దంపతులు తమ ఇన్‌స్టా వేదికగా  పంచుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో బిడ్డకు స్వాగతం పలకనున్నట్లు పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయం తెలుసుకున్న ప్రముఖులు ఈ జంటకు అభినందనలు తెలుపుతున్నారు. ఇకపోతే దీపిక.. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌ని 2018లో పెళ్లి చేసుకుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement