పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ అంటూ అసభ్యంగా రాశారు: హీరోయిన్‌ ఆవేదన | Manjima Mohan claimed that my father in law not happy with our marriage: | Sakshi
Sakshi News home page

Manjima Mohan: 'పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ.. చాలా బాధపడ్డా'

Published Wed, May 29 2024 8:05 PM | Last Updated on Wed, May 29 2024 8:47 PM

Manjima Mohan claimed that my father in law not happy with our marriage:

చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నటి మంజిమా మోహన్. తమిళ సినిమాల్లో తనదైన నటనతో ప్రశంసలు అందుకున్నారు. సాహసమే శ్వాసగా సాగిపో అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది మలయాళ ముద్దుగుమ్మ. అయితే ప్రముఖ నటుడు గౌతమ్ కార్తీక్‌ను 2022లో ఆమె వివాహం చేసుకుంది. కానీ అప్పట్లో వీరి పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో పెద్దఎత్తున రూమర్స్‌ వచ్చాయి.  గౌతమ్ తండ్రి వీరి పెళ్లితో సంతోషంగా లేరని.. పెళ్లికి ముందే మంజిమ గర్భవతి అని కొందరు అసభ్యకరమైన వార్తలు రాసుకొచ్చారు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో మంజిమ వాటిపై స్పందించింది. అవన్నీ ఒట్టి రూమర్స్‌ అని కొట్టిపారేసింది. అంతే కాకుండా తన వ్యక్తిగత జీవితం, కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.

మంజిమ మోహన్ మాట్లాడుతూ.. 'నా పెళ్లి గురించి సోషల్ మీడియాలో అవాస్తవాలే వచ్చాయి. పెళ్లి కాకముందే నేను గర్భవతినని రాశారు. దీంతో మా మామయ్య అసంతృప్తిగా ఉన్నారంటూ వార్తలొచ్చాయి. ఇలాంటి రూమర్స్‌ మా కుటుంబ సభ్యులను బాధపెట్టాయన్నది నిజం. పెళ్లికి ముందు కూడా ఇలా అసభ్యంగా కామెంట్స్‌ చేశారు.  కానీ అవేవీ నన్ను ఎప్పుడూ ప్రభావితం చేయలేదు. కానీ పెళ్లయిన తర్వాత నాలో భయం మొదలైంది. ఇలాంటి వ్యాఖ్యలు చదివి ఎందుకు బాధగా ఉన్నావని గౌతమ్ అడిగేవాడు. నాపై వస్తున్న కామెంట్స్‌ చూసి గౌతమ్‌కి నేను సరైన జోడీ కాదనే ఫీలింగ్ కలిగేది. కానీ గౌతమ్‌ నాకు సపోర్ట్‌గా నిలిచారు. ఏదైనా బాధలో ఉంటే చెప్పాలని నన్ను అడిగేవాడు.' అని తెలిపింది.

కాగా.. మలయాళంలో సూపర్ హిట్ అయిన కలియూంజల్ సినిమా ద్వారా మంజిమా మోహన్ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. మధురనోంబరకాట్టులో తన నటనకు గాను ఆమె కేరళ రాష్ట్ర ఉత్తమ బాలనటిగా అవార్డును గెలుచుకుంది. ఆమె ప్రముఖ సినిమాటోగ్రాఫర్, ఫిల్మ్ మేకర్ విపిన్ మోహన్ కుమార్తెగా ఇండస్ట్రీలో ప్రవేశించింది. ముత్తయ్య డైరెక్ట్ చేసిన దేవరట్టం సినిమాలో గౌతమ్, మంజిమ కలిసి నటించారు. ఆ సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు, పెళ్లి చేసుకున్న్నారు. చివరిగా 2023లో బూ చిత్రంలో నటించిన మంజిమ ఆ తర్వాత ఏ సినిమాలోనూ నటించలేదు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement