
మెగా కోడలు, గ్లోబర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల మరికొద్ది రోజుల్లో ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె నిండు గర్భవతి కాగా.. మరికొద్ది రోజుల్లో ఉపాసన-రామ్ చరణ్ జంట తమ మొదటి బిడ్డను స్వాగతించనున్నారు.
(ఇది చదవండి: ప్రెగ్నెన్సీ గురించి ఊహించని విషయం చెప్పిన ఉపాసన!)
పెళ్లైన పదేళ్ల తర్వాత గర్భం దాల్చడంతో మెగా ఫ్యామిలీలో సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భం కోసం కుటుంబ సభ్యులతో పాటు ఫ్యాన్స్ కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఇక ఉపాసన ఇంట్లోనే ఉంటూ సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు.
(ఇది చదవండి: వారసత్వం కోసం బిడ్డను కనడం లేదు.. ఉపాసన ఆసక్తికర పోస్ట్)
అయితే తాజాగా ఉపాసన తన ఫోటోలను ఇన్‌స్టాలో పంచుకుంది. తన ప్రెగ్నెన్సీలో ట‍్రైమిస్టర్ సంబంధించిన పిక్స్ షేర్ చేసింది. అంతే కాకుండా ఫోటోలకు క్యాప్షన్ కూడా ఇచ్చింది. నా ఫోన్‌లో ఉన్న ఇంత మంచి ఫోటోలను ఇంతకు ముందు ఎందుకు పోస్ట్ చేయలేదా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ పోస్ట్‌కు మహేశ్ బాబు సతీమణి కామెంట్ రిప్లై కూడా ఇచ్చింది. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment