
‘ప్రేమలో ఉన్నప్పుడు.. పెళ్లి ఎప్పుడు అని అడుగుతారు.. తీరా పెళ్లాయ్యాక పిల్లల గురించి ప్రశ్నిస్తారు. మా మానాన మమ్మల్ని బతకనివ్వరా’ అంటూ మండిపడుతున్నారు బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ. ఈ నటి చివరగా కనిపించిన చిత్రం జీరో. షారుక్ హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత అనుష్క మరే సినిమాకు సైన్ చేయలేదు. దాంతో అనుష్క గర్భవతి అయ్యింది.. అందుకే సినిమాలకు దూరంగా ఉందనే పుకార్లు షికారు చేస్తున్నాయి.
ఈ వార్తలపై అనుష్క తీవ్రంగా మండిపడ్డారు. ‘సెలబ్రిటీల గురించి ఇలాంటి వార్తలు తెలుసుకోవాలని జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. కానీ అవి వారిని ఎంత ఇబ్బందికి గురి చేస్తాయో ఆలోచించరు. ఓ నటికి వివాహం అయ్యిందంటే.. తరువాతి ప్రశ్న పిల్లలు. ఇలాంటి ప్రశ్నలకు వివరణ ఇవ్వకపోతే.. మరిన్ని పుకార్లు సృష్టిస్తారు.. నిజంగా ఇలా చేయడం అవసరమా.. అరే మా జీవితాల్లోకి తొంగి చూడటం మానేయండి. మా మాననా మమ్మల్ని బతకనివ్వండి’ అంటూ అనుష్క ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment