
టాలీవుడ్ టు బాలీవుడ్ ఇప్పుడంతా బయోపిక్ (జీవిత కథ) సీజన్ నడుస్తోంది. తెలుగులో మహానటి సావిత్రి, తెలంగాణ ముఖ్యమంతి కేసీఆర్ బయోపిక్‌లు తెర కెక్కుతుండగా, ఎన్టీఆర్ బయోపిక్‌లు సెట్స్‌పైకి వెళ్లనున్నాయి. తెలుగు క్రీడాకారులు సానియా మీర్జా, సైనా నెహ్వాల్, పుల్లెల గోపీచంద్, పీవీ సింధులతో పాటు శివసేన అధినేత బాల్ ఠాక్రే, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ తదితరుల బయోపిక్స్ తెరకెక్కుతున్నాయి.
తాజాగా ఈ జాబితాలోకి మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి బయోపిక్ కూడా చేరింది. ‘యుగపురుష్ అటల్’ టైటిల్‌తో ఈ చిత్రం రూపొందనుంది. ‘కాలా సచ్’ ఫేమ్ మయాంక్ పి. శ్రీ వాస్తవ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. స్పెక్ట్రమ్ మూవీస్ పతాకంపై రాజీవ్ ధమీజా, అమిత్ జోషి, రంజిత్ శర్మ ఈ సినిమా నిర్మించనున్నారు. వాజపేయి గతంలో రాసిన ఓ కవిత్వం ఆధారంగా సంగీత దర్శకుడు బప్పీ లహరి ‘యుగపురుష్ అటల్’ చిత్రంలోని ఓ పాటకు సంగీతం అందించడం విశేషం. త్వరలో ఈ సినిమా పట్టాలెక్కనుంది.
Comments
Please login to add a commentAdd a comment