ఆడి పాడి ఆనందించడానికే ఈ జీవితం అన్నట్టుగా పాటను పంచిన బప్పీ లహిరి శాశ్వతంగా వీడ్కోలు తీసుకున్నారు. లక్షలాది మంది అభిమానులను శోక సంద్రంలో ముంచారు. కేవలం తన పాటలతోనే కాదు.. ఆహార్యంతోనూ అందరిలోనూ ప్రత్యేకంగా నిలిచిన బప్పీ ఇక సెలవు అంటూ దివికేగారు.
ఫ్యాన్సీ కాలర్..
బప్పీ ఎక్కువగా కోట్లు ధరించడానికి ఇష్టపడేవారు. టీ–షర్ట్ పైన జాకెట్ ధరించేవారు. అలాగే తాను ధరించే కోట్ లేదా జాకెట్స్‌ని ప్రత్యేకంగా ఎంబ్రాయిడరీ చేయించుకునేవారు. ఫ్యాన్సీ కాలర్స్, ఆర్నమెంట్స్‌తో జాకెట్స్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా ఉండేవి.
ముల్లెట్ హెయిర్ స్టయిల్
1970లలో బాగా పాపులర్ అయిన హెయిర్ స్టైలే ముల్లెట్. కొంత పొడవుగా, పొట్టిగా ఉన్న వెంట్రుకల కలయికే ఈ హెయిర్ స్టైల్ ప్రత్యేకత. ఈ హెయిర్ స్టైల్‌నే బప్పీ చనిపోయేవరకు ఫాలో అయ్యారు.
అదృష్ట అద్దాలు
పగలేగాక, రాత్రి సమయాల్లో జరిగే ఈవెంట్లకు సైతం కళ్లద్దాలను తప్పనిసరిగా పెట్టుకునేవారు బప్పీ. 51 రకాల సన్ గ్లాసెస్ తన దగ్గర ఉన్నాయని ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. రూ.1.5 లక్షల ఖరీదైన లూయిస్ వ్యూటన్ గ్లేర్ కళ్లద్దాలు కూడా బప్సీ కలెక్షన్స్‌లో ఉండడం విశేషం. ఇక 51 సన్ గ్లాసెస్‌లో నాలుగైదు అద్దాలు తనకు అదృష్టం తెచ్చిపెట్టాయని ఓ సందర్భంలో బప్పీ తపేర్కొన్నారు.
అలాగే మెడలో ఉన్న గొలుసుల్లో ఒక గొలుసులో వినాయకుడి లాకెట్ కనబడుతుంది. ఎన్ని గొలుసులు మార్చినా బప్పీ ఇది మార్చేవారు కాదు. బయటికొచ్చేటప్పుడు ఆభరణాలు, సన్ గ్లాస్‌లు, ఆడంబరమైన దుస్తులు ధరించే బప్పీ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం చాలా సింపుల్. మామూలు దుస్తులు ధరించడం ఆయన అలవాటు. అలాగే ఒంటి మీద ఆభరణాలు కూడా ఉంచుకునేవారు కాదు.
గోల్డ్ టీ సెట్
బంగారు ఆభరణాలను ఇష్టంగా కొనుక్కున్న బప్పీ ఆ మధ్య ధన్‌తేరాస్‌కి వెరైటీ గోల్డ్ టీ–సెట్ కొన్నారు. ధన్‌తేరాస్‌కి ఏం కొందామని భార్య అడిగితే, ఒక మంచి గోల్డ్ టీ సెట్ కొని తెమ్మని అన్నారట. భర్త ఊహకు దగ్గరగా ఉన్న గోల్డ్ టీ సెట్ కొని, ఆయనకు బహుమతిగా ఇచ్చారు చిత్రాణి.
ఫిష్ లవర్
బెంగాలీ ఫుడ్ అంటే బప్పీకి చాలా ఇష్టం. ముఖ్యంగా చేపలను ఇష్టంగా తినేవారు. వారానికి ఒక్కరోజు మాత్రమే శాకాహారం తీసుకునేవారు. మాంసాన్ని బాగా ఇష్టపడే బప్పీ అనారోగ్య కారణాలతో రెడ్ మీట్ మానేసారు. సాయంత్రం సమయంలో చికెన్ శాండ్‌విచ్ తినడానికి ఇష్టపడేవారు. సముద్ర చేపలకంటే నదిలో పెరిగే చేపలను బాగా ఇష్టపడేవారు. ఆవనూనెతో వండిన చేపల కూరను ఎక్కువగా తీసుకునేవారు.
-కె
చదవండి: Bappi Lahiri: మరణానికి రెండు రోజుల ముందు కూడా 'బంగారు' బప్పి.. పోస్ట్ వైరల్
Comments
Please login to add a commentAdd a comment