'ఈ సిటీ నాకు రెండో ఇల్లు' | bollywood music director bappi lahiri shares attachment with hyderabad | Sakshi
Sakshi News home page

'ఈ సిటీ నాకు రెండో ఇల్లు'

Published Thu, Dec 24 2015 7:26 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

'ఈ సిటీ నాకు రెండో ఇల్లు' - Sakshi

'ఈ సిటీ నాకు రెండో ఇల్లు'

హైదరాబాద్: బాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ బప్పీ లహరి హైదరాబాద్లో సందడి చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంపై ఆయన తన అభిమానాన్ని వెల్లడించారు.

‘‘ఈ నగరంతో నా అనుబంధం మాటలకు అందనిది, అది నా హృదయ స్పందనతో ముడిపడింది. కోల్‌కతాలో పుట్టినా ముంబైలో ఎక్కువ కాలం ఉన్నా ఈ నేల నాకెంతో ప్రియాతీ ప్రియమైనది. ఓ రకంగా ఈ సిటీ నాకు రెండో ఇల్లు లాంటిది’’  అని బప్పీ లహరి అన్నారు.

బంజారాహిల్స్‌లోని ఓ రెస్టారెంట్‌లో బాలీవుడ్ డిస్కో కార్నివాల్ పేరుతో నిర్వహిస్తున్న ఫుడ్ ఫెస్టివల్‌ను ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా బప్పీ లహరి మాట్లాడుతూ తెలుగు సినిమా పాటలకు స్వరాలు అందించిన సమయంలో కొన్ని రోజుల పాటు ఇక్కడ ఉన్నానని, జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాలు తనకు చిరపరిచితమన్నారు. తన మ్యూజిక్‌ని విజయవంతం చేసి అభిమానించే తెలుగు ప్రేక్షకులకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానన్నారు. వారి కోసం త్వరలోనే ఒక పాప్ ఆల్బమ్‌ను చేయబోతున్నానని బప్పీ లహరి వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement