హాలీవుడ్ పీతకు గొంతు అరువిస్తున్న టాప్ సింగర్ | bappi lahiri to lend voice to a giant crab of hollywood | Sakshi
Sakshi News home page

హాలీవుడ్ పీతకు గొంతు అరువిస్తున్న టాప్ సింగర్

Published Mon, Oct 31 2016 11:12 AM | Last Updated on Mon, Sep 4 2017 6:48 PM

హాలీవుడ్ పీతకు గొంతు అరువిస్తున్న టాప్ సింగర్

హాలీవుడ్ పీతకు గొంతు అరువిస్తున్న టాప్ సింగర్

 
ఆయన గొంతు భారతదేశానికి సుపరిచితం. ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు అయిన బప్పీ లాహిరి ఎక్కడ ఏ కార్యక్రమానికి వచ్చినా.. బ్రహ్మాండంగా బంగారు గొలుసులు, రంగురంగుల చొక్కాలు వేసుకుని మరీ వస్తారు. భారతీయ సినిమాల్లో డిస్కో తరహా మ్యూజిక్ అందించిన మొదటి సంగీత దర్శకుడిగా కూడా ఆయన ప్రసిద్ధి చెందారు. అలాంటి బప్పీ.. తొలిసారిగా హాలీవుడ్‌లో అడుగు పెడుతున్నారు. అలాగని ఆయన అక్కడ పాట పాడతారో, సంగీతం అందిస్తారో అనుకుంటే పొరపాటే. 
 
 
హాలీవుడ్‌లో ఒక పీతకు ఆయన తన గొంతు అరువిస్తున్నారట. అవును.. డిస్నీ సంస్థ నిర్మిస్తున్న యానిమేషన్ సినిమా 'మోనా'లో టమాటోవా అనే ఓ పెద్ద పీత పాత్రకు ఆయన డబ్బింగ్ చెబుతున్నారు. ఈ విషయాన్ని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు. మొత్తానికి మన బప్పీ లాహిరి.. హాలీవుడ్‌లోకి కూడా అడుగుపెట్టేస్తున్నారన్న మాట.
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement