disney animation movie
-
‘లవ్ ప్రపోజ్ బాగానే చేశాననుకున్నా.. కానీ’
న్యూఢిల్లీ : సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మహింద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహింద్రా మరోసారి ఓ వైరల్ న్యూస్‌ని పరిచయం చేశారు. బోస్టన్‌కు చెందిన సినీ దర్శకుడొకరు లవ్ ప్రపోజ్ ఎలా చేశాడో పేర్కొంటూ ఓ చక్కని వీడియోను ట్విటర్లో పోస్టు చేశారు. ‘ఈ వీడియో క్లిప్ ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయింది. తన చిన్ననాటి స్నేహితురాలికి ప్రేమ విషయం చెప్పేందుకు ఓ వ్యక్తి ఏకంగా డిస్నీ సినిమానే ఎంచుకున్నాడు. దానిని చక్కగా ఎడిట్ చేసి.. తన ప్రేమను ఘనంగా.. అత్యద్భుతంగా తెలియజేశాడు. 40 ఏళ్ల క్రితం నా ప్రేమను కూడా చాలా గొప్పగా ప్రపోజ్ చేశాను అనుకున్నాను. కానీ, ఈ వీడియో చూశాక.. మరీ ఘనంగా నా ప్రేమను వ్యక్త పరచలేదనిపిస్తోంది’అని ఆనంద్ మహింద్రా పేర్కొన్నారు. వీడియో క్లిప్‌లో ఏముంది..! బోస్టన్‌కు చెందిన సినీ దర్శకుడు లీ లోచ్లర్ తన చిన్ననాటి స్నేహితురాలికి వినూత్నంగా లవ్ ప్రజోజ్ చేద్దామనుకున్నాడు. దానికోసం ప్రసిద్ధ డిస్నీ యానిమేషన్ మూవీ ‘స్లీపింగ్ బ్యూటీ’ని ఎంచుకున్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన ఓ చిత్రకారుడి సాయంతో.. స్లీపింగ్ బ్యూటీలోని ఓ సన్నివేశాన్ని ఎడిట్ చేశాడు. ప్రత్యేకంగా ఓ థియేటర్‌ను అద్దెకు తీసుకుని ఆ సినిమా కొనసాగుతుండగా.. అనూహ్యంగా హీరో హీరోయిన్లకు బదులు లీ లోచ్లర్, అతని స్నేహితురాలు డాక్టర్ స్తుతి చిత్రాలు దర్శనమిస్తాయి. సినిమాలో మాదిరిగా థియోటర్లో జరుతున్న సన్నివేశాలతో స్తుతి సంభ్రమాశ్చర్యంలో మునుగుతుంది. ఇక లీ లోచ్లర్ ఓ డైమండ్ రింగ్‌తో తన బ్యూటీకి లవ్ ప్రపోజ్ చేస్తాడు. ఆమె అతని ప్రేమకు ఫిదా అవుతుంది. ఈ అద్భుత ప్రేమ వ్యక్తీకరణ గత డిసెంబర్ 30న అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో జరిగింది. -
జున్ను కోసం లయన్‌కి డబ్బింగ్ చెప్పా
‘‘నా గొంతు సినిమాలకు పనికిరాదని చెప్పినవాళ్లు ఇండస్ట్రీలో ఉన్నారు. కానీ, ఇప్పుడు నా గొంతు డిస్నీ సినిమాకు డబ్బింగ్ చెప్పే స్థాయికి చేరుకోవడం గర్వంగా ఉంది’’ అని నటుడు జగపతిబాబు అన్నారు. జాన్ ఫెవరూ దర్శకత్వం వహించిన హాలీవుడ్ చిత్రం ‘ద లయన్ కింగ్’. డిస్నీ వరల్డ్ స్టుడియోస్ సంస్థ నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ నెల 19న విడుదలవుతోంది. ఈ సినిమాలోని ముఫాసా, స్కార్, సింబా, నల, పుంబా, టిమోన్ పాత్రలకు తెలుగులో రవిశంకర్, జగపతిబాబు, నాని, లిప్సిక, బ్రహ్మానందం, అలీ డబ్బింగ్ చెప్పారు. ఈ చిత్రం తెలుగు ట్రైలర్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా జగపతిబాబు మాట్లాడుతూ– ‘‘యానిమేషన్ చిత్రానికి డబ్బింగ్ చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే జంతువుల్లోని భావాలు, భావనలకి అతికేలా డబ్బింగ్ చెప్పాలి. ఈ యానిమేషన్ చిత్రంలోనూ విలన్‌కు డబ్బింగ్ చెప్పాల్సి వచ్చింది. అన్ని వయసుల వారినీ మెప్పించే చిత్రమిది’’ అన్నారు. నాని మాట్లాడుతూ – ‘‘ఈ ఏడాది చేస్తున్న సినిమాలన్నీ నా కోసం, ప్రేక్షకుల కోసం. ‘ది లయన్ కింగ్’కి నా కొడుకు జున్ను కోసం (నాని కుమారుడు అర్జున్) డబ్బింగ్ చెప్పాను. జంతువుల హావభావాలకి అతికేలా డబ్బింగ్ చెప్పేటప్పుడు నవ్వుకునేవాణ్ని. భావోద్వేగభరితమైన కథతో రూపొందిన ఈ సినిమా అందరికీ బాగా నచ్చుతుంది’’ అన్నారు. ‘‘డిస్నీవారు తెరకెక్కించిన చిత్రానికి డబ్బింగ్ చెప్పడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా’’ అన్నారు అలీ. -
హాలీవుడ్ పీతకు గొంతు అరువిస్తున్న టాప్ సింగర్
ఆయన గొంతు భారతదేశానికి సుపరిచితం. ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు అయిన బప్పీ లాహిరి ఎక్కడ ఏ కార్యక్రమానికి వచ్చినా.. బ్రహ్మాండంగా బంగారు గొలుసులు, రంగురంగుల చొక్కాలు వేసుకుని మరీ వస్తారు. భారతీయ సినిమాల్లో డిస్కో తరహా మ్యూజిక్ అందించిన మొదటి సంగీత దర్శకుడిగా కూడా ఆయన ప్రసిద్ధి చెందారు. అలాంటి బప్పీ.. తొలిసారిగా హాలీవుడ్లో అడుగు పెడుతున్నారు. అలాగని ఆయన అక్కడ పాట పాడతారో, సంగీతం అందిస్తారో అనుకుంటే పొరపాటే. హాలీవుడ్లో ఒక పీతకు ఆయన తన గొంతు అరువిస్తున్నారట. అవును.. డిస్నీ సంస్థ నిర్మిస్తున్న యానిమేషన్ సినిమా 'మోనా'లో టమాటోవా అనే ఓ పెద్ద పీత పాత్రకు ఆయన డబ్బింగ్ చెబుతున్నారు. ఈ విషయాన్ని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు. మొత్తానికి మన బప్పీ లాహిరి.. హాలీవుడ్‌లోకి కూడా అడుగుపెట్టేస్తున్నారన్న మాట. Bappi Lahiri makes his Hollywood debut... Lends his voice for the character of Tamatoa [a giant crab] in Disney’s animation film #Moana. pic.twitter.com/lYSyfXMQ0t — taran adarsh (@taran_adarsh) 31 October 2016