ప్రముఖ గాయకుడు, బాలీవుడ్ సంగీత దిగ్గజం బప్పి లహిరి(69) కన్నుమూసిన సంగతి తెలిసిందే. ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల బాలీవుడ్, టాలీవుడ్‌కు చెందిన సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
చదవండి: ప్రముఖ గాయకుడు బప్పి లహిరి కన్నుమూత
ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేస్తూ.. ‘బప్పి లహరితో నాకు మంచి అనుబంధం ఉంది. ఆయన నా కోసం అనేక చార్ట్‌బస్టర్ సాంగ్‌లను అందించారు, అవి నా చిత్రాల ప్రజాదరణకు ఎంతో దోహదపడింది. ఆయన సంగీతంలో ప్రతిబింబించే తన ప్రత్యేకమైన శైలి, జీవితం పట్ల చూపించే ఉత్సాహంతో ఆయన ఎల్లప్పుడూ గుర్తుండిపోతారు’ అంటూ చిరు రాసుకొచ్చారు.
Rest in Peace Bappi da! #BappiLahiri pic.twitter.com/67QT9U7lgv
— Chiranjeevi Konidela (@KChiruTweets) February 16, 2022
ఆయనతో నాకు సుధీర్ఘ అనుబంధం: మోహన్ బాబు
బప్పి లహరి మరణంపై మంచు మోహన్ బాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారతదేశపు లెజెండరీ సంగీత దర్శకుల్లో ఒకరైన బప్పీలహరి మరణం విచారకరం. ఆయన పాటలు కీలక పాత్ర పోషించిన 3సూపర్‌హిట్ చిత్రాల్లో ఆయనతో కలిసి పనిచేసే అదృష్టం దక్కింది. ఆయనతో నాకు సుధీర్ఘ అనుబంధం ఉంది. బప్పీలహరి కుటుంబానికి దేవుడు దైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా అంటూ మోహన్‌బాబు ట్వీట్‌లో పేర్కొన్నారు.
Saddened to hear the demise of Shri Bappi Lahiri, one of the Legendary Music Composers of India, had the honor of working with him for 3 super hit movies in which his songs played a crucial role. Had a long association with him. I pray for his family's strength.
— Mohan Babu M (@themohanbabu) February 16, 2022
Om Shanti! pic.twitter.com/09QZRyLh5q
బప్పిలహరి మరణంపై నందమూరి బాలకృష్ణ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణవార్త నన్నెంగానో కలచివేసింది. 'నేను నటించిన 'రౌడి ఇన్‌స్పెక్టర్', 'నిప్పురవ్వ' వంటి చిత్రాలకు బప్పి లహరి సంగీతం అందించారు. ఈరోజు ఆయన మన మధ్య లేకపోవడం ఎంతో దురదృష్టకరం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను' అంటూ బాలయ్య ఓ ప్రకటనలో తెలిపారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
చదవండి: తొలిసారి కాస్టింగ్ కౌచ్‌పై నోరు విప్పిన స్వీటీ, అవకాశాల కోసం అలా చేయాల్సిందే..
Comments
Please login to add a commentAdd a comment