
లెజెండరీ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ బప్పి లహరి మృతిపై బాలీవుడ్ సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. నవంబర్ 27, 1952న పశ్చిమ బెంగాల్‌లో జన్మించిన బప్పి లహిరి అన్ని భాషల్లో కలిపి 5వేలకు పైగా పాటలు పాడారు. సంగీతానికి వెస్టర్న్ మ్యూజిక్ మిక్స్ చేసి మైమరపించిన సంగీత దిగ్గజం బప్పి లహరి అనారోగ్య సమస్యలతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన అంత్యక్రియలు రేపు(గురువారం)నిర్వహించనున్నారు.
చదవండి: మరణానికి ముందు.. బప్పి షేర్ చేసిన చివరి పోస్ట్ ఇదే
బప్పి లహరి కుమారుడు బప్పా లహరి ప్రస్తుతం లాస్ ఏంజిల్స్‌లో ఉంటున్నారు. తండ్రి మరణవార్త తెలిసి హుటాహుటిన భారత్‌కు బయలుదేరారు. ఈ నేపథ్యంలో కుమారుడు వచ్చాకే ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దీంతో రేపు ముంబైలో బప్పి లహరి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. చదవండి: బప్పి లహరికి బంగారం అంటే ఎందుకంత ఇష్టమో తెలుసా?