ప్రముఖ గాయకుడు, బాలీవుడ్ సంగీత దిగ్గజం బప్పి లహరి(69) బుధవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. అనారోగ్యంతో బాధపడుతూ ముంబైలోని క్రిటీ కేర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ బప్పి లహరి తుదిశ్వాస విడిచారు. బప్పి లహరి మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. బప్పి లహరి మరణం బాలీవుడ్‌కే కాదు తెలుగు సినిమాకు కూడా తీరని లోటు. ఆయన సంగీతం అందించిన సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ సొంతం చేసుకున్నాయి. ఈయన గళం నుంచి వచ్చిన పాట కుర్రకారును ఊపేశాయి.
అమీర్ ఖాన్ తండ్రి తాహిర్ హుస్సేన్ 'జఖ్మీ' చిత్రం ద్వారా బప్పి పాపులర్ అయ్యారు. ఆపై డిస్కో డ్యాన్సర్, డ్యాన్స్ డ్యాన్స్, సాహెబ్, కమాండో, గురు దక్షిణ, ప్రేమ ప్రతిజ్ఞ, గురు, త్యాగి, ది దర్టీ పిక్చర్, రాక్ డ్యాన్సర్, బద్రినాథ్ కీ దుల్హనియా వంటి హిందీ సినిమాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. బాలీవుడ్‌తోపాటు సౌండ్ ఇండస్ట్రీకి కూడా బప్పి పనిచేశారు. తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినా కూడా ఎప్పటికీ గుర్తుండిపోయే పాటలు ఇచ్చారు. ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరోలకు ఆయన అందించిన సినిమాలు ఎప్పటికీ గుర్తిండిపోతాయి. మరి తెలుగులో బప్పి నుంచి వచ్చిన మరిచిపోలేని పాటలు ఏంటో ఓ సారి చూద్దాం.
చదవండి: బప్పి లహరికి బంగారం అంటే ఎందుకంత ఇష్టమో తెలుసా?
1. సూపర్‌స్టార్ కృష్ణ నటించిన ‘సింహాసనం’ సినిమా ద్వారా బప్పి టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఇందులోని ‘ఆకాశంలో ఒక తార’ నేటికి అందరికి గుర్తుండే ఉంటుంది. కృష్ణ, జయప్రద కలిసి డ్యాన్స్ చేసిన ఈ పాట ఎవర్‌గ్రీన్ సూపర్‌హిట్.
2. మెగాస్టార్ చిరంజీవి, బప్పి లహరి కాంబినేషన్‌లో వచ్చిన మొదటి సినిమా ‘స్టేట్ రౌడీ’. ఇందులోని ‘అరెరే యముడికి నే మొగుడిని రా’.. ‘రాధా రాధా మదిలోనా మన్మథ బాధా’.. పాటలు సూపర్ హిట్‌ను సొంతం చేసుకున్నాయి.
3. బప్పి, చిరంజీవి కెరీర్‌లోనే బప్పి బెస్ట్ సాంగ్స్ అందించారు. ఇందులో గ్యాంగ్ లీడర్ ఒకటి. గ్యాంగ్ లీడర్ టైటిల్ సాంగ్.. భద్రాచలం కొండ.. వానా వానా పాటలు పాపులర్ అయ్యాయి.
4. తరువాత చిరంజీవితో కలిసి రౌడీ అల్లుడు చిత్రం చేశారు. ఇందులోని చిలుకా క్షేమమా, అమలాపురం బుల్లెమ్మో నీకేమి కావాలా పాటలతో పాటు రౌడీ అల్లుడులో మిగిలిన పాటలు కూడా హిట్ అయ్యాయి.
5. డైలాగ్ కింగ్ మోహన్ బాబుతో కూడా బప్పి కలిసి పనిచేశారు. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన రౌడీ గారి పెళ్లాం సినిమాలోని బోయవాని వేటుకు అనే పాట ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
6. బాలకృష్ణ హీరోగా నటించిన యాక్షన్ చిత్రం రౌడీ ఇన్ స్పెక్టర్’ కు బప్పి లహరి మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఇందులోని అరే ఓ సాంబా.. పాట ఇప్పటికీ బాలయ్య ఫ్యాన్స్ మళ్లీ మళ్ళీ వింటూనే ఉంటారు.
7. మోహన్‌బాబు ప్రధాన పాత్రలో నటించిన ‘ బ్రహ్మ’ సినిమాలోని జేసుదాస్ పాడిన ‘ముసి ముసి నవ్వులలోన’ పాటతో కనెక్ట్ అవ్వని తెలుగు ప్రేక్షకుడు లేడు.
8. చిరంజీవి, రోజా కలిసి నటించిన బిగ్‌బాస్ చిత్రంలోని మావోయ్ మావా మావవా, నంబర్ 1, 2 పాటలు పాటలు ఫేమస్ అయ్యాయి.
8. తెలుగులో చివరికిగా 2020లో హీరో రవితేజ నటించిన డిస్కోరాజా చిత్రంలో పాట పాడారు.
Comments
Please login to add a commentAdd a comment