
బాహుబలితో జాతీయ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న హీరో ప్రభాస్. ఈ చిత్రంతో ఇండియన్ సూపర్‌స్టార్‌గా ఎదిగిన ప్రభాస్.. తన తదుపరి చిత్రాలను కూడా ఆ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ సాహో షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించారు మేకర్స్. రీసెంట్‌గా సాహో చిత్రబృందానికి చుక్కెదురైంది.
సాహో చిత్రానికి గాను శంకర్, ఇషాన్ నూరని, లాయ్ మెన్‌డోన్సా త్రయాన్ని సంగీత దర్శకులుగా ఎంచుకున్నారు. అయితే విడుదల తేదీ దగ్గరపడుతుండగా.. ఈ మూవీ నుంచి తప్పుకున్నట్లు సంగీత దర్శకులు ప్రకటించడం సినీ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. మరి వీరి నిష్క్రమణకు కారణాలు మాత్రం వెల్లడించలేదు. యూనిట్ నుంచి బయటకు వెళ్తూ.. ప్రభాస్, సుజిత్, వంశీ, ప్రమోద్, శ్యామ్‌లకు ఆల్‌ది బెస్ట్ చెప్పారు. మరి వీరి స్థానంలో ఎవరిని తీసుకుంటారో వేచి చూడాలి.
We wish to inform all our fans that Shankar Ehsaan Loy have opted out of composing the music for #Saaho here’s wishing #Prabhas @Sujeetsign #Vamsi #Pramod #Shyam all the luck for the film :)
— Shankar Ehsaan Loy (@ShankarEhsanLoy) May 27, 2019