''జనులే తరలి చేరే కిటకిటల పర్యాటకుల పట్టణం.. ఎవరూ మరిచిపోని అనుభవం ఇచ్చేటి గొప్ప పట్టణం.. మా తిరుపతి'' ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పాట వినిపిస్తోంది. రావణ్ నిట్టూరు కధానాయకుడిగా కాస్కేడ్ పిక్చర్స్ బ్యానర్‌పై రమేష్ డబ్బుగొట్టు, రెడ్డి రాజేంద్ర పి నిర్మిస్తున్న చిత్రం 'అలిపిరికి అల్లంత దూరంలో'. స్టార్ డైరెక్టర్ నందిని రెడ్డి వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన ఆనంద్ జె ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
ఫణి కళ్యాణ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి రిలీజైన మా తిరుపతి పాట యూట్యూబ్‌లో తెగ ట్రెండ్ అవుతోంది. తిరుపతి వైభవాన్ని వర్ణిస్తూ సాగిన ఈ పాట అందరి ఫేవరేట్ రింగ్ టోన్‌గా మారిపోయింది. కిట్టు విస్సాప్రగడ లిరిక్స్ అందించగా శంకర్ మహదేవన్, రమ్య బెహార అద్భుతంగా పాడారు. ఇక సినిమా విషయానికి వస్తే ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి.
చదవండి: విజయ్ 'లైగర్'కు బాయ్‌కాట్ సెగ.. ట్విట్టర్‌లో ట్రెండింగ్
ఆ సినిమా కోసం మహేశ్ సిక్స్ ప్యాక్? ఫోటోతో లీక్ చేసిన నమ్రత
Comments
Please login to add a commentAdd a comment