యువ సంగీత దర్శకుడు అమ్రిష్ను ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ ప్రశంసించారు.
తమిళ సినిమా: యువ సంగీత దర్శకుడు అమ్రిష్ను ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ ప్రశంసించారు. నటి జయచిత్ర వారసుడు అమ్రిష్ హీరోగా పరిచయమై అనంతరం సంగీత దర్శకుడిగా రాణిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ప్రభుదేవా హీరోగా నటిస్తున్న ఎంగ్‌మంగ్‌చంగ్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ భారీ చిత్రంలో లక్ష్మీమీనన్ హీరోయిన్ గా నటిస్తున్నారు.
ఈ చిత్రంలోని అయ్యనార్ వందుటారు ఇంగేపారు అనే పాటను అమ్రిష్ దర్శకత్వంలో ఇటీవల ముంబైలో రికారి్డంగ్ చేశారు. ఈ పాటను ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ పాడడం విశేషం. పాట పాడిన అనంతరం శంకర్ మహదేవన్ జయచిత్రకు ఫోన్ చేసి పాట అద్భుతంగా వచ్చింది, మీ అబ్బాయి గొప్ప సంగీత దర్శకుడు అవుతారని ప్రశంసించారని ఆమె తెలిపారు. కాగా మరో పాటను చిత్ర హీరో ప్రభుదేవా రాయగా సంగీత దర్శకుడు అమ్రిష్ ఆలపించడం మరో విశేషం.