Amrish
-
రూ.26 కోట్ల మోసం! సంగీత దర్శకుడిపై కేసు కొట్టివేత
సాక్షి ప్రతినిధి, చెన్నై: సీనియర్ నటి, దర్శక, నిర్మాత జయచిత్ర కుమారుడు, సంగీత దర్శకుడు అమ్రీష్పై నమోదైన కేసును మద్రాసు హైకోర్టు కొట్టివేసినట్లు ఆయన తరఫు న్యాయవాది ఎల్ ఇన్ఫెంట్ దినేష్ తెలిపారు. చెన్నైలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో చెన్నై వలసరవాక్కంకు చెందిన నెడుమారన్ అనే వ్యాపారవేత్త, ఇరీడియం పేరుతో అమ్రీష్ రూ. 26 కోట్లు మోసం చేశారంటూ ఇటీవల ఫిర్యాదు చేశాడని తెలిపారు. ఈ కేసులో అమ్రీష్ను పోలీసులు అరెస్ట్ చేయగా బెయిల్పై బయటకు వచ్చినట్లు చెప్పారు. తనపై అక్రమంగా బనాయించిన కేసును కొట్టి వేయాలంటూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ అమ్రీష్ వేశారని, వారి మధ్య ఒక చిత్రానికి సంబంధించిన లావాదేవీలు మాత్రమే జరిగాయని, ఆయన నిర్మించనున్న ఒక చిత్రానికి సంగీత దర్శకత్వం వహించేందుకు అడ్వాన్సుగా తీసుకున్న మొత్తంలో కొంత తిరిగి చెల్లించానని, పూర్తిగా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానని అమ్రీష్ కోర్టుకు విన్నవించినట్లు తెలిపారు. ఇందుకు సమ్మతించిన సదరు పారిశ్రామికవేత్త అమ్రీష్పై ఇచ్చిన ఫిర్యాదును వాపస్ తీసుకున్నట్లు వెల్లడించారు. వాదనలను విన్న అనంతరం సదరు కేసుతో అమ్రీష్కు సంబంధం లేనందున కేసును కొట్టి వేస్తున్నట్లు న్యాయమూర్తి నిర్మల్ కుమార్ మంగళవారం తీర్పు చెప్పారని న్యాయవాది ఇన్ఫెంట్ దినేష్ తెలియజేశారు. చదవండి: 'ఆమెతో డేటింగ్ చేశాను!' అందులో నిజమెంతో ఎవరికి తెలుసు? -
చారిత్రక చిత్రంతో శృంగార తార..
సాక్షి, చెన్నై : స్టన్నింగ్ వార్త ఏంటో తెలుసా? శృంగార తారగా గుర్తింపు పొందిన సన్నిలియోన్ తమిళ చిత్రంలో హీరోయిన్గా నటించడం, అదీ చారిత్రక ఇతివృత్తంతో రూపొందనున్న చిత్రం కావడమే. ఇదంతా ప్రచారంలో ఉన్న విషయమే. అయితే కొత్త విషయం ఏమిటంటే ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు అమ్రేశ్ సంగీత బాణీలు అందించనున్నారంట. ఆయన తొలి చిత్రం నానే ఇన్నుళ్ ఇల్లై తోనే కథానాయకుడు, సంగీత దర్శకుడు అంటూ జోడెద్దుల సవారీ చేశారు. ఆ తరువాత సంగీతంపైనే దృష్టి సారించిన అమ్రేశ్ మొట్టశివ కెట్టశివ చిత్రానికి సంగీత బాణీలు కట్టి శభాష్ అనిపించుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. అలాగే అమ్రేశ్ సంగీతం అందించిన భాస్కర్ ఒరు రాస్కెల్ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ఇప్పటికే ఈ చిత్ర ఆడియోకు పరిశ్రమ వర్గాలు, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. త్రిష ప్రధాన పాత్ర పోషించిన గర్జన, ప్రభుదేవా హీరోగా నటిస్తున్న యంగ్ మంగ్ ఛంగ్, ప్రభు, ప్రభుదేవా కలిసి నటిస్తున్న చార్లి చాప్లిన్–2 చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. తాజాగా సన్నిలియోన్ నటించనున్న చిత్రానికి సంగీతం అందించే అవకాశం అమ్రేశ్ను వెతుక్కుంటూ వచ్చింది. స్టీవ్స్ కార్నర్ పతాకంపై పోన్సీ స్టీఫెన్ నిర్మించనున్న ఈ భారీ బడ్జెట్ చారిత్రాత్మక కథా చిత్రానికి వీసీ.వడివుడయాన్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించనున్నారు. ఈ అవకాశంపై అమ్రేశ్ స్పందిస్తూ.. ‘చిత్ర కథ అద్భుతంగా ఉంది. ఇందులో సన్నిలియోన్కు భారీ పోరాట దృశ్యాలు ఉంటాయి. ఈ చిత్రానికి సంగీతం రూపొందించడానికి విదేశాలకు వెళుతున్నాం. చాలా కొత్త బాణీలను రూపొందించనున్నాను. ఆ తరుణం కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నా’ అన్నారు. -
అమ్రిష్కు శంకర్ మహదేవన్ ప్రశంసలు
తమిళ సినిమా: యువ సంగీత దర్శకుడు అమ్రిష్ను ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ ప్రశంసించారు. నటి జయచిత్ర వారసుడు అమ్రిష్ హీరోగా పరిచయమై అనంతరం సంగీత దర్శకుడిగా రాణిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ప్రభుదేవా హీరోగా నటిస్తున్న ఎంగ్మంగ్చంగ్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ భారీ చిత్రంలో లక్ష్మీమీనన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రంలోని అయ్యనార్ వందుటారు ఇంగేపారు అనే పాటను అమ్రిష్ దర్శకత్వంలో ఇటీవల ముంబైలో రికారి్డంగ్ చేశారు. ఈ పాటను ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ పాడడం విశేషం. పాట పాడిన అనంతరం శంకర్ మహదేవన్ జయచిత్రకు ఫోన్ చేసి పాట అద్భుతంగా వచ్చింది, మీ అబ్బాయి గొప్ప సంగీత దర్శకుడు అవుతారని ప్రశంసించారని ఆమె తెలిపారు. కాగా మరో పాటను చిత్ర హీరో ప్రభుదేవా రాయగా సంగీత దర్శకుడు అమ్రిష్ ఆలపించడం మరో విశేషం.