Jaya Chithra
-
‘అలా జరిగి ఉంటే.. బాహుబలిలో రాజమాత పాత్ర నేను చేసేదాన్ని’
చాలా గ్యాప్ తర్వాత సీనియర్ నటి, అలనాటి హీరోయిన్ జయచిత్ర మణిరత్నం పొన్నియన్ సెల్వన్‌లో మెరిశారు. 70, 80లలో గ్లామరస్ హీరోయిన్గా తెలుగు తెరపై అలరించిన వారిలో ఆమె ఒకరు. శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు వంటి అగ్ర హీరోలందరి సరసన హీరోయిన్గా నటించి మెప్పించారు ఆమె. ఆ తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన జయచిత్ర అత్త, తల్లి పాత్రలతో రీఎంట్రీ ఇచ్చారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా వరుస ఆఫర్లు అందుకుంటున్న ఆమె తాజాగా పొన్నియన్ సెల్వన్‌లో ఓ ప్రధాన పాత్రలో కనిపంచారు. ఈ నేపథ్యంలో రీసెంట్గా ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో జయచిత్ర తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. చదవండి: హీరోతో లిప్‌లాక్ సీన్.. రాత్రిళ్లు ఉలిక్కి పడి లేచేదాన్ని: రష్మిక ఎన్నో చిత్రాల్లో హీరోయిన్గా నటించి.. సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా స్టార్ హీరోలకు అత్త పాత్రలు వంటి పవర్ఫుల్ రోల్స్ చేసిన తనకు ఇప్పటికి ఓ అసంతృప్తి ఉందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఓ సీరియల్లో నటించే అవకాశం కొల్పోయానంటూ జయచిత్ర వాపోయారు. ‘నేను హీరోయిన్గా ఉన్నప్పుడు నాకు వచ్చిన సినిమాలు నేను చేసుకుంటూ వెళ్లేదాన్ని. కానీ ఓ సీరియల్లో అవకాశం చేజారిపోవడం నాకు చాలా బాధ కలిగించింది. ఆ సీరియల్ పేరు ‘మంగమ్మగారి మనవరాలు’. దర్శకుడు రాఘవేంద్రరావుగారి ఫ్యామిలీకి చెందినవారే ఆ సీరియల్ చేశారు. ఆ సీరియల్‌కి సంబంధించిన విషయాలను మాట్లాడటానికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. అదే సమయంలో నేను ఫోన్లో అదే సీరియల్ కథను వింటున్నాను’ అని చెప్పారు. చదవండి: ప్రభాస్‌కు ఏమైంది? ఫ్యాన్స్ ఆందోళన ‘‘అయితే వచ్చిన వారిలో ఒకరు నా గురించి ఆసత్య ప్రచారం చేసి ఆ సీరియల్ అవకాశం పోయేలా చేశారు. నేను ఫోన్లో ఆ సీరియల్ కథ వింటుండగానే వచ్చిన వారిలో ఓ వ్యక్తి ‘నేను సీరియల్ చేయనన్నాననీ, ఫారిన్ వెళ్లిపోయే ఉద్దేశంతో ఉన్నానని’ అవతలివారికి చెప్పేశారు. రాజమౌళి గారి గెస్టు హౌస్‌లో ఉంటూ ఆ సీరియల్ చేయడానికి ఒప్పుకున్నప్పటికీ, రాఘవేంద్రగారికి లేనిపోనివి చెప్పారు. అలా ఆ ప్రాజెక్టులో నేను లేకుండా పోయాను. ఒకవేళ ఆ సీరియలక్లో నేను నటించి ఉంటే ‘బాహుబలి’ సినిమాలో రాజమాత పాత్ర నాకు దక్కి ఉండేదేమో. ఇన్ని సినిమాలు చేసిన నాకు ఒక సీరియల్ ఇలా మిస్సయిందే అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు మాత్రం చాలా బాధగా అనిపిస్తుంది’’ అంటూ చెప్పుకొచ్చారు. -
ఇదో తల్లీ కొడుకుల రికార్డు
నటిగా నేను, సంగీత దర్శకుడిగా నా కొడుకు అమ్రేష్ ఒకేసారి చిత్ర పరిశ్రమలో కొనసాగడం ఒక రికార్డు అని సీనియర్ నటీమణి, దర్శక, నిర్మాత జయచిత్ర పేర్కొన్నారు. తెలుగు చిత్రాల ప్రముఖ దర్శకులు సుకుమార్ నిర్మాతగా ఏవీఏం స్టూడియోలో హండ్రెడ్ పర్సంట్ కాదల్ చిత్ర షూటింగ్ బుధవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా జయచిత్ర సాక్షితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... సాక్షి, చెన్నై : హీరోయిన్ గా, తల్లిగా, అత్తగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇప్పటివరకు సుమారు రెండు వందల పై చిలుకు చిత్రాల్లో నటించాను. డైరెక్టర్ కే.బాలచందర్ సతీమణిగా సుమారు ఎనిమిదేళ్ల క్రితం నటించిన రెట్టైసుళి చిత్రం, ఐదేళ్ల క్రితం విడుదలైన జూనియర్ ఎన్ టీఆర్ హీరోగా నటించిన నరశింహుడు చిత్రాల తరువాత కుటుంబ బాధ్యతలకు దగ్గరగా సినిమాలకు దూరంగా ఉన్నాను. హీరోగా రాణించి, సంగీత దర్శకుడుగా సైతం ఎదుగుతున్న కుమారుడు అమ్రేష్‌కు తల్లిగా అండదండలు ఇవ్వడంలోని ఆనందాన్ని పొందుతున్నాను. నేను షూటింగులకు వెళ్లేటపుడు తాను సపర్యలు చేసేవాడు, ఈరోజు తనకు నేను సహకరించడం, సినీ పరిశ్రమలో పొందుతున్న పేరు ప్రఖ్యాతులను దగ్గరుండి చూడడంలో ఎంతో ఆత్మసంతృప్తి ఉంది. నాలుగో ఇన్నింగ్స్ ఆరంభం నటీమణిగా నా హయాంలో తొలితరం హీరోలు ఎంజీ రామచంద్రన్, శివాజీగణేశన్, రెండోతరం కమల్‌హాసన్, రజనీకాంత్, మూడోతరం అజిత్, విజయ్‌లతో ముచ్చటగా మూడు ఇన్నింగ్స్‌ను విజయవంతంగా పూర్తిచేశాను. హండ్రెడ్ పర్సంట్ కాదల్ (హండ్రడ్ పర్సంట్ లవ్ తెలుగు చిత్రానికి రీమేక్) తమిళ చిత్రంలో నాలుగోతరం హీరో అయిన జీవీ ప్రకాష్‌తో నాలుగో ఇన్నింగ్స్‌ను ప్రారంభించాను. చిత్ర కథను క్లుప్తంగా వివరిస్తూ ఒక అబ్బాయి, అమ్మాయి లు కలిగిన తరువాత ఏర్పడిన మనస్పర్థల వల్ల నేను భర్త (నాజర్) విడిపోతాం. అయితే మా పిల్లల పిల్లలు ( హీరో హీరోయిన్లు) ప్రేమించుకున్నా చిన్న గొడవ కారణంగా పెళ్లి చేసుకోకుండానే విడిపోతారు. వారిద్దరిలోని మనస్పర్థలు తొలగించి కలపడమే నా క్యారెక్టర్. నేను పిల్లలను కలిపితే పిల్లలు మా జంటను కలుపుతారు. సినిమాలో నాది కీరోల్. ఇలాంటి కీలకమైన పాత్ర వస్తే నటించేందుకు రెడీ. ఆలోచనలో పడ్డాను ఇటీవల నేను ఏ ఫంక్షన్ కు వెళ్లినా సినిమాల్లో ఎందుకు నటించడం లేదని పదే పదే అడగడంతో ఆలోచనలో పడ్డాను. ఇన్నాళ్లూ ఉద్దేశపూర్వకంగా సినిమాలకు దూరంగా ఉండలేదు. ఈ క్యారెక్టర్‌కు మీరే కావాలని ఎవరైనా వస్తే కాదనే ప్రసక్తేలేదు. బుధవారం ప్రారంభమైన తమిళ చిత్ర దర్శకులు చంద్రమౌళి, నిర్మాతలు నా ఇంటికి వచ్చి కోరడం, మంచి చిత్రకథాంశం కావడంతో అంగీకరించాను. మరలా నేను సినిమా ఒప్పుకోవడంతో అమ్రేష్ ఎంతో ఆనందించాడు. ఆకలితో రాత్రి నిద్రపట్టక పోవడంతో మంగళవారం అర్ధరాత్రి 1.30 గంటలకు స్వయంగా ఆమ్లేట్ తినిపించాడు. అదేంటిరా అని అడిగితే నాకు నీవు చేస్తున్నావు, నీకు నేను చేస్తే తప్పేంటి అని చిరునవ్వుతో సమాధనం ఇచ్చాడు. బుధవారం పొద్దున్నే లేచి సాగనంపాడు. నటిగా తల్లి, హీరో, సంగీత దర్శకునిగా కొడుకు ఒకేసారి చిత్ర పరిశ్రమలో ఉండడం బహుశా ఇది ఒక రికార్డు. -
అమ్రిష్కు శంకర్ మహదేవన్ ప్రశంసలు
తమిళ సినిమా: యువ సంగీత దర్శకుడు అమ్రిష్ను ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ ప్రశంసించారు. నటి జయచిత్ర వారసుడు అమ్రిష్ హీరోగా పరిచయమై అనంతరం సంగీత దర్శకుడిగా రాణిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ప్రభుదేవా హీరోగా నటిస్తున్న ఎంగ్మంగ్చంగ్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ భారీ చిత్రంలో లక్ష్మీమీనన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రంలోని అయ్యనార్ వందుటారు ఇంగేపారు అనే పాటను అమ్రిష్ దర్శకత్వంలో ఇటీవల ముంబైలో రికారి్డంగ్ చేశారు. ఈ పాటను ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ పాడడం విశేషం. పాట పాడిన అనంతరం శంకర్ మహదేవన్ జయచిత్రకు ఫోన్ చేసి పాట అద్భుతంగా వచ్చింది, మీ అబ్బాయి గొప్ప సంగీత దర్శకుడు అవుతారని ప్రశంసించారని ఆమె తెలిపారు. కాగా మరో పాటను చిత్ర హీరో ప్రభుదేవా రాయగా సంగీత దర్శకుడు అమ్రిష్ ఆలపించడం మరో విశేషం.