
జుగల్‌బందీ
ఒకరిది గానామృతం. మరొకరిది తబలా విన్యాసం. శాస్త్రీయ గీతమైనా, సినీ పాటయినా ప్రతి మదినీ శ్రావ్యంగా స్పృశించే హరిహరన్... వెస్ట్రన్ స్టైలైనా, క్లాసికల్ టచ్ అయినా గంగాప్రవాహంలా తబలను శృతిచేసే ఉస్తాద్ జాకీర్‌హుస్సేన్... అలసిన మనసులపై పన్నీటి జల్లులు కురిపించే మహత్తర సంగీత ఝరి నగరవాసులను మైమరిపించేందుకు సిద్ధమైంది. దాదాపు ఇరవై ఏళ్ల తరువాత కలసి చేసిన ‘హాజిర్ 2’ ఆల్బమ్‌లోని పాటలను వినిపించి మురిపించేందుకు ఉద్దండులిద్దరూ వస్తున్నారు. మాదాపూర్ సైబర్‌సిటీ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ నెల 24న జరిగే ఈ కార్యక్రమం వివరాలకు 95429 76567 నంబర్లో సంప్రదించవచ్చు.