
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): వింతవ్యాధి సోకి 4వేల కోళ్లు మృతి చెందిన సంఘటన కాల్వశ్రీరాంపూర్‌లో మంగళవారం చోటు చేసుకుంది. కాల్వశ్రీరాంపూర్‌లో పెద్దంపేట మాజీ సర్పంచ్ దాసరి స్వామి నాటుకోళ్ల ఫారం నిర్వహిస్తున్నాడు. మార్కెట్లో అమ్మేందుకు ఎదురుచూస్తున్న తరుణంలో వింత వ్యాధి సోకి చనిపోతున్నట్లు బాధితుడు తెలిపాడు. వీటి విలువ రూ.8 లక్షలు ఉంటుందని పేర్కొన్నాడు. ఈ విషయమై వైద్యాధికారి డాక్టర్ సురేశ్‌గౌడ్‌ను సంప్రదించాడు.
కాగా కోళ్లకు రానిఖేట్ వ్యాధి సోకిందని, మృతి చెందిన కోళ్లను గుంత తీయించి పూడ్చి పెట్టాలని సూచించామని చెప్పారు. మృతి చెందిన కోళ్ల శ్యాంపిల్‌ను ల్యాబ్‌కు పంపించినట్లు వివరించారు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని బాధితుడు విజ్ఞప్తి చేశాడు.
చదవండి: తెలంగాణ సచివాలయంలో నాగుపాము కలకలం
Comments
Please login to add a commentAdd a comment