Amazing Health Benefits Of Palm Jaggery - Sakshi
Sakshi News home page

తాటిబెల్లం ఏయే వ్యాధులను నయం చేస్తుందంటే..!

Published Wed, Jun 28 2023 11:45 AM | Last Updated on Fri, Jul 14 2023 4:05 PM

Amazing Health Benefits of Palm Jaggery - Sakshi

తాటిబెల్లం మనం వాడుతున్న పంచదారకి అద్భతమైన ప్రత్యామ్నాయం. నిజానికి మనం రోజు తినే పంచదార చెరుకు నుంచి తయారవుతుంది. కాని దీన్ని తయారుచేసే సమయంలో ఇందులో ఉన్న పోషక విలువలు అన్నీ పోయి కేవలం తీపి మాత్రమే మిగులుతుంది. దీనిలో తీపి రుచి తప్ప ఎలాంటి ప్రయోజనాలు ఉండవు. ఈ తాటిబెల్లం దేవుడు ఇచ్చిన ప్రకృతి ప్రసాదంగా చెప్పుకోవచ్చు. ఇందులో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. దీన్ని తాటి చెట్టు నుంచి నేరుగా తయారు చేస్తారు. ఇందులో అవసరమైన ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. చక్కెర కంటే 60 రెట్లు ఎక్కువ ఖనిజాలు ఉంటాయి.

ఈ ఖనిజాల తోపాటు అనేక విటమిన్లు దీనిలో ఉంటాయి. ఆహారం జీర్ణం కావడానికి బాగా ఉపయోగపడుతుంది. అందువల్లే కొన్ని ప్రాంతాల్లో ఆహారం తీసుకున్న తర్వాత తాటిబెల్లం ముక్క తింటారు. పేగులను శుభ్రపరచడానికి సహాయపడుతుంది. ఇందులో ఇనుము సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తంలోని హిమోగ్లోబిన్‌ స్థాయిని పెంచి ఆస్తమాని తగ్గించేందుకు దోహదపడుతుంది. అంతేగాదు ఎముకలకు బలాన్ని ఇచ్చి కాల్షియం, పోటాషియం, భాస్వరం తదితరాలు ఉంటాయి. దీన్ని తరుచుగా తీసుకోవడం వల్ల నీరసం రాదు, పైగా శరీర పుష్టి, వీర్య వృద్ధిని కలిగిస్తుంది. 

ఎలాంటి వ్యాధులకు చెక్‌ పెడుతుందంటే..

  • తాటి బెల్లం తినడం వల్ల క్యాన్సర్‌ కారకాలతో పోరాడి క్యాన్సర్‌ రాకుండా చేస్తుంది. 
  • శరీరంలో ఉండే విషపదార్థాలను బయటకు పంపిస్తుంది. 
  • ఇది శ్వాసకోస, ప్రేగులు, ఆహార గొట్టం, ఊపిరితిత్తులు, చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులులో ఉండే విష పదార్థాలను బయటికి పంపించి పేగు క్యాన్సర్‌ రాకుండా చేస్తుంది. 
  • దీనిలో ఫైబర్‌ అధికం ఉండటం వల్ల మలబద్ధకం, అజీర్తి చికిత్సకు సహయపడుతుంది. 
  • శరీరంలోని హానికర టాక్సిన్‌ను బయటికి పంపించి మలబద్ధక సమస్యను నివారిస్తుంది. 
  • పొడి దగ్గు, ఆస్మా వంటి శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్న వ్యక్తి ఉదయాన్నే దీన్ని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.  
  • ఉదయాన్నే ఒక టేబుల్‌ స్పూన్‌ తాటి బెల్లం తీసుకుంటే మైగగ్రెయిన్‌ తలనొప్పి తగ్గుతుంది. 
  • ఇది కొవ్వుని కరిగించి అధికి బరువు తగ్గించడంలో ఉపయోగపడుతుంది. 
  • బీపీని కంట్రోల్‌ చేస్తుంది
  • లివర్‌ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. 
  • స్త్రీలలో బహిష్టు సమస్యలను అరికడుతుంది.
  • దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు బ్లడ్ ప్యూరిఫై చేసి శరీరంలో దెబ్బతిన్న కణజాలాన్ని పునరుద్ధరిస్తుంది. 
  • రోగనిరోధక శక్తిని పెంచి, శరీరంలోని వేడిని తొలగిస్తుంది.
  • షుగర్ వ్యాధిగ్రస్తులు దీనిని తక్కువ మోతాదులో తీసుకోవచ్చు. దీనిని రోజు 25-30 గ్రాముల వరకు తీసుకోవచ్చు.
  • చివరగా ఇది ఎక్కువగా గుంటూరు జిల్లా నిజామా పట్నం మండలం కాలిలో దొరుకుతుంది అలాగే గోదావరి జిల్లా నిడదవోలు,తాడేపల్లిగూడెం,చాగల్లు,కొవ్వూరు,పెదవేగి దేవరపల్లి, గోపాలపురం, భీమవరం, వీరవాసరం, తణుకులో ఎక్కువగా దొరుకుతుంది.

దీంతో చేసుకునే సింపుల్‌ స్నాక్‌ ఐటెం తాటి బెల్లం నువ్వుల లడ్డు:
కావాల్సిన పదార్థాలు:
తాటి బెల్లం 2 కప్పులు
నువ్వులు  2 కప్పులు

తయారీ విధానం:
తాటి బెల్లం కోరి చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. ఒక గిన్నెలో నువ్వులు తీసుకుని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేవరకూ వేయించుకోవాలి. వచ్చిన నువ్వులు, తాటి బెల్లం కలిపి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ నుంచి మిశ్రమాన్ని తీసి చిన్న చిన్న ఉండలు చేసుకుంటే తాటి బెల్లం ఉండలు తయారవుతాయి.

(చదవండి: ర్షాకాలం..వ్యాధుల కాలం..ఈ జాగ్రత్తలు పాటిస్తే..వ్యాధులు పరార్‌!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement