వెండితెరపై తమ అందం, గ్లామర్‌తో ఆకట్టుకుంటునే భామలు వ్యక్తిగతంగా పలు అరోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అందులో స్టార్ హీరోయిన్ సమంత, మమత మోహన్ దాస్, శృతి హాసన్‌తో సహా పలువురు నటీనటులు ఉన్నారు. ఇటీవల మయెసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడ్డ సామ్ ప్రస్తుతం కోలుకుంది.మయోసైటిస్‌తో బాధపడుతున్నానని సమంత వెల్లడించడంతో పలువురు నటీనటులు, హీరోయిన్లు కూడా బయటకు వచ్చి తమ వ్యాధిని బయటపెట్టారు.
చదవండి: ప్రేమికుల రోజున సీనియర్ హీరోకి అదితి ప్రపోజ్! సిద్ధార్థ్ రియాక్షన్ ఇదే..
తాజాగా స్వీటీ అనుష్క కూడా ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పింది. ఇటీవల ఓ తమిళ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించిన ఆమె తాను బాధపడుతున్న అరుదైన వ్యాధి గురించి బయటపెట్టింది. తనకు నవ్వే జబ్బు ఉందంటూ ఆసక్తిర వ్యాఖ్యలు చేసింది. అది పెద్ద సమస్య కానప్పటికి తాను నవ్వడం స్టార్ట్ చేస్తే 15 నుంచి 20 నిమిషాల పాటు నవ్వుతూనే ఉంటానని చెప్పింది.
చదవండి: ఆలియా బాటలోనే కియారా! పెళ్లికి ముందే ప్రెగ్నెంటా? నటుడి షాకింగ్ ట్వీట్
‘నవ్వించే సంఘటన వస్తే పడి పడి నవ్వుతూనే ఉంటాను. నవ్వుని అసలు కంట్రోల్ చేసుకోలేను. ఇక సెట్‌లో నేను నవ్వడం స్టార్ట్ చేస్తే షూటింగ్ ఆపేసుకోవాల్సిందే. దాదాపు 20 నిమిషాల పాటు నవ్వుతూనే ఉంటా. ఈ గ్యాప్‌లో ప్రొడక్షన్ వాళ్లు టిఫిన్స్, స్నాక్స్ లాంటివి కంప్లీట్ చేసుకుని వస్తారు’ అని అంటూ తన అరుదైన వ్యాధి గురించి చెప్పుకొచ్చింది. కాగా ప్రస్తుతం అనుష్క మైత్రి మూవీ ప్రొడక్షన్‌లో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో యంగ్ హీరో నవీన్ పొలిశెట్టితో కలిసి నటిస్తోంది. ఈ చిత్రానికి ‘మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment