ప్రతీకాత్మక చిత్రం
న్యూయార్క్ : ఎంత ఆరోగ్యంగా ఉన్నా ఒక్క రోజులో కళ్లు కోల్పోతారు.. శరీరాన్ని మెల్లమెల్లగా తినేస్తుంది.. తొందరగా మనిషిని చంపేస్తుంది.. ఇది కొత్తగా శాస్త్రవేత్తలు కనుగొన్న ఓ భయంకరమైన వ్యాధి తాలూకా ప్రభావాలు. ‘‘జాకబ్స్ స్యూల్ ఆఫ్ మెడిసిన్ అండ్ బయోమెడికల్ సైన్సెస్ ఆట్ ద యూనివర్శిటీ ఆట్ బఫెలో’’ పరిశోధకులు థామస్ ఎ. రస్సో అతని బృందం‘‘ హైపర్‌వైరలంట్ క్లెబ్సిల్లా నిమోనియా’’ అనే వ్యాధిని గుర్తించారు. చాలా అరుదుగా సోకే ఈ జబ్బు అత్యంత ప్రమాదకరమైనది. మందులకు సైతం లొంగని ఈ వ్యాధిని నిర్థారించటానికి ఇంత వరకూ ఎలాంటి పరీక్షలు అందుబాటులో లేవు.
తీసుకునే ఆహారం, నీటి కారణంగా ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి సోకుతుందని పరిశోధకులు అనుమానిస్తున్నప్పటికి ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. థామస్ ఎ. రస్సో మాట్లాడుతూ.. క్లెబ్సిల్లా నిమోనియా, హైపర్‌వైరలంట్ క్లెబ్సిల్లా నిమోనియా రెండూ ప్రమాదకరమైనవి అయినప్పటికి హైపర్‌వైరలంట్ మరింత ప్రమాదకరమైనదని, శరీరంలోపల వ్యాప్తి చెంది వ్యాధి నిరోధక శక్తిని దెబ్బతీస్తుందని వెల్లడించారు. ఎంత ఆరోగ్యంగా ఉన్న యువకులైనా ఈ వ్యాధి బారిన పడినప్పుడు లివర్, మెదడుపై కురుపులు రావటం, వ్యాధి శరీరాన్ని తొలిచి తినటం ద్వారా మరణం సంభవిస్తుందని తెలిపారు. ఈ వ్యాధిపై మరిన్ని పరిశోధనలు జరపటం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment