University at Buffalo
-
శరీరాన్ని తినేస్తుంది.. తొందరగా చంపేస్తుంది
న్యూయార్క్ : ఎంత ఆరోగ్యంగా ఉన్నా ఒక్క రోజులో కళ్లు కోల్పోతారు.. శరీరాన్ని మెల్లమెల్లగా తినేస్తుంది.. తొందరగా మనిషిని చంపేస్తుంది.. ఇది కొత్తగా శాస్త్రవేత్తలు కనుగొన్న ఓ భయంకరమైన వ్యాధి తాలూకా ప్రభావాలు. ‘‘జాకబ్స్ స్యూల్ ఆఫ్ మెడిసిన్ అండ్ బయోమెడికల్ సైన్సెస్ ఆట్ ద యూనివర్శిటీ ఆట్ బఫెలో’’ పరిశోధకులు థామస్ ఎ. రస్సో అతని బృందం‘‘ హైపర్వైరలంట్ క్లెబ్సిల్లా నిమోనియా’’ అనే వ్యాధిని గుర్తించారు. చాలా అరుదుగా సోకే ఈ జబ్బు అత్యంత ప్రమాదకరమైనది. మందులకు సైతం లొంగని ఈ వ్యాధిని నిర్థారించటానికి ఇంత వరకూ ఎలాంటి పరీక్షలు అందుబాటులో లేవు. తీసుకునే ఆహారం, నీటి కారణంగా ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి సోకుతుందని పరిశోధకులు అనుమానిస్తున్నప్పటికి ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. థామస్ ఎ. రస్సో మాట్లాడుతూ.. క్లెబ్సిల్లా నిమోనియా, హైపర్వైరలంట్ క్లెబ్సిల్లా నిమోనియా రెండూ ప్రమాదకరమైనవి అయినప్పటికి హైపర్వైరలంట్ మరింత ప్రమాదకరమైనదని, శరీరంలోపల వ్యాప్తి చెంది వ్యాధి నిరోధక శక్తిని దెబ్బతీస్తుందని వెల్లడించారు. ఎంత ఆరోగ్యంగా ఉన్న యువకులైనా ఈ వ్యాధి బారిన పడినప్పుడు లివర్, మెదడుపై కురుపులు రావటం, వ్యాధి శరీరాన్ని తొలిచి తినటం ద్వారా మరణం సంభవిస్తుందని తెలిపారు. ఈ వ్యాధిపై మరిన్ని పరిశోధనలు జరపటం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయన్నారు. -
సెలక్ట్ అయ్యారంటూ మెయిల్.. అంతలోనే
బఫేలో, న్యూయార్క్: ఎన్నో ఆశలతో యూనివర్సిటీలో అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకున్న 5000 మంది విద్యార్థులకు సెలక్ట్ అయినట్టుగా యూనివర్సిటీ నుంచి మెయిల్లు అందాయి. అయితే కొద్ది సేపట్లోనే.. తూచ్ అంటూ మరో మెయిల్.. విషయమేంటంటే ముందు వచ్చిన మెయిల్ తప్పంటూ దాని సారంశం. దీంతో సెలక్ట్ అయ్యామన్న ఆనందం విద్యార్థుల్లో కొద్ది సేపైనా లేకుండా పోయింది. ఇంత పెద్ద తప్పిదం చేసింది ప్రపంచంలోనే మేటి యూనివర్సిటీలలో ఒకటైన ది స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్(యూనివర్సిటీ అట్ బఫేలో ). తమ యూనివర్సిటీలో అడ్మిషన్లకోసం దరఖాస్తు చేసుకున్న 5000 మంది విద్యార్థులకు యాక్సెప్టెన్సీ మెయిల్స్ పంపింది. అయితే పొరపాటున దరఖాస్తులను పూర్తి స్థాయిలో పరిశీలించక ముందే సెలక్ట్ అయినట్టుగా మెయిల్స్ పంపామని యూనివర్సిటీ అధికార ప్రతినిధి జాన్ డెల్లా తెలిపారు. తప్పిదాన్ని గుర్తించి మూడు, నాలుగు గంటల వ్యవధిలోనే విద్యార్థులను క్షమాపణ కోరుతూ మరో మెయిల్ పంపామని జాన్ పేర్కొన్నారు. అప్లికేషన్ డేటాబెస్ నుంచి తప్పుగా ఈమెయిల్స్ లిస్ట్ జనరేట్ అవ్వడం వల్లే ఈ తప్పిదం జరిగిందని యూనివర్సిటీ అట్ బఫేలో అధికారిక వెబ్సైట్ లో పేర్కొంది. మరో ముఖ్యమైన విషయమేంటంటే తప్పుగా ఈ మెయిల్స్ వచ్చిన వారిలోనూ.. తమ యూనివర్సిటీలో దరఖాస్తుల పరిశీలన తర్వాత ఎంపిక చేసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ యూనిర్సిటీలో 30,000 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.