కేరళలో ‘గవదబిళ్లలు’ వ్యాప్తి.. ఒక్క రోజులో 190 కేసులు! | Kerala Mumps Disease is Spreading | Sakshi
Sakshi News home page

Kerala: కేరళలో ‘గవదబిళ్లలు’ వ్యాప్తి.. ఒక్క రోజులో 190 కేసులు!

Published Tue, Mar 12 2024 12:54 PM | Last Updated on Tue, Mar 12 2024 12:54 PM

Kerala Mumps Disease is Spreading - Sakshi

కేరళలో ‘గవదబిళ్లలు’(మంప్స్‌) వ్యాధి బారినపడిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా ఒక్కరోజులో 190 కేసులు బయటపడడంతో వైద్యశాఖలో ఆందోళన నెలకొంది. మార్చి నెలలోనే 2,505 గవదబిళ్లల కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలు ఈ వ్యాధి విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ కేరళ ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం గత రెండు నెలల్లో మొత్తం 11,467 గవదబిళ్లలు కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి నేరుగా బాధితుని రోగనిరోధక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

ఈ వ్యాధిని ‘చిప్‌మంక్ చీక్స్‌’ అని కూడా అంటారు. ఈ వ్యాధి బారినపడనప్పుడు జ్వరం, తలనొప్పి, అలసట, శరీర నొప్పి, లాలాజల గ్రంధులలో వాపు మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధి సోకినప్పుడు బాధితుని  బుగ్గలు వాచినట్లు కనిపిస్తాయి. ఒక్కోసారి ఈ వ్యాధి  లక్షణాలు బాధితునిలో రెండు మూడు వారాల తర్వాత కనిపిస్తాయి.

పారామిక్సోవైరస్ అనే వైరస్ కారణంగా ‘గవదబిళ్లలు’ వ్యాప్తి చెందుతుంది. ఇది బాధితుని నోటి నుంచి వెలువడే నీటి బిందువుల ద్వారా వ్యాపిస్తుంది. ఒక వ్యక్తి నుండి మరొకరికి ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ‘గవదబిళ్ల’ బారిన పడినవారికి మెదడు వాపు వచ్చే ప్రమాదం కూడా ఉండవచ్చని వైద్యులు చెబుతున్నారు.

ఈ వ్యాధి రాకుండా ఉండేందుకు మాస్కులు ధరించాలని, ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ వ్యాధి బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కలిగిన వ్యక్తులను అధికంగా ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధికి చికిత్స  కొద్ది రోజుల పాటు కొనసాగుతుంది. యాంటీబయాటిక్స్‌తో ఈ వ్యాధి త్వరగా నయం కాదు. ‘గవదబిళ్ల’ బారినపడినవారు ఆమ్ల ఆహారాలకు దూరంగా ఉండాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement