rapidly
-
మహిళా ఓటర్లు తలచుకుంటే.. గత ఐదేళ్లలో జరిగిందిదే!
దేశంలోని మహిళలు ఓటు వేసేందుకు అమితమైన ఉత్సాహం చూపిస్తున్నారు. గత ఐదేళ్లలోని గణాంకాలు దీనిని స్పష్టం చేస్తున్నాయి. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా ఓటర్ల సంఖ్య పెరిగిందని పలు నివేదికలు చెబుతున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పరిశోధనా నివేదికలోని వివరాల ప్రకారం గత ఐదేళ్లలో ఎన్నికలు జరిగిన 23 రాష్ట్రాల్లోని 18 రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారని తేలింది. ఇక్కడ గమనించాల్సిన ఇంకో విషయం కూడా ఉంది. ఈ 18 రాష్ట్రాల్లోని 10 రాష్ట్రాల్లో తిరిగి అదే ప్రభుత్వం ఏర్పడటం విశేషం. దేశ రాజకీయాల్లో గేమ్ ఛేంజర్‌గా మారుతున్న మహిళా ఓటర్లు 2029 ఎన్నికల్లో పురుషుల కంటే అధికంగా ఉండనున్నారు. 17వ లోక్‌సభలో మొత్తం ఎంపీల్లో 15 శాతం మంది మహిళలు ఉన్నారు. మొదటి లోక్‌సభలో ఈ సంఖ్య ఐదు శాతంగా ఉంది. నివేదిక ప్రకారం రాబోయే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం ఓటర్ల సంఖ్య 96.8 కోట్లు. వీరిలో 68 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారనే అంచనాలున్నాయి. వీరిలో 33 కోట్ల మంది అంటే 49 శాతం మంది మహిళా ఓటర్లు ఉండనున్నారు. 85.3 లక్షల మంది మహిళలు తొలిసారిగా ఓటు వేయనున్నారు. 2047 నాటికి (2049లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది) మహిళా ఓటర్ల సంఖ్య 55 శాతానికి (50.6 కోట్లు) పెరుగుతుందని, పురుషుల సంఖ్య 45 శాతానికి (41.4 కోట్లు) తగ్గనుందని నివేదిక పేర్కొంది. 2047 నాటికి 115 కోట్ల మంది ఓటర్లు ఉంటారని, వీరిలో 80 శాతం మంది అంటే 92 కోట్ల మంది ఓటు వేస్తారని నివేదిక అంచనా వేసింది. ప్రభుత్వ పథకాలు అందుకోవడంలో మహిళా లబ్ధిదారులు ముందంజలో ఉన్నారు. స్టాండప్ ఇండియాలో వారి వాటా 81 శాతం. ముద్రా లోన్‌లో మహిళలకు 68 శాతం, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనలో 37 శాతం, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనలో 27 శాతం వాటా ఉంది. గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, తెలంగాణలలో మహిళా ఓటర్ల సంఖ్య వేగంగా పెరుగుతోందని నివేదిక చెబుతోంది. -
కేరళలో ‘గవదబిళ్లలు’ వ్యాప్తి.. ఒక్క రోజులో 190 కేసులు!
కేరళలో ‘గవదబిళ్లలు’(మంప్స్) వ్యాధి బారినపడిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా ఒక్కరోజులో 190 కేసులు బయటపడడంతో వైద్యశాఖలో ఆందోళన నెలకొంది. మార్చి నెలలోనే 2,505 గవదబిళ్లల కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలు ఈ వ్యాధి విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ కేరళ ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం గత రెండు నెలల్లో మొత్తం 11,467 గవదబిళ్లలు కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి నేరుగా బాధితుని రోగనిరోధక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ వ్యాధిని ‘చిప్మంక్ చీక్స్’ అని కూడా అంటారు. ఈ వ్యాధి బారినపడనప్పుడు జ్వరం, తలనొప్పి, అలసట, శరీర నొప్పి, లాలాజల గ్రంధులలో వాపు మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధి సోకినప్పుడు బాధితుని బుగ్గలు వాచినట్లు కనిపిస్తాయి. ఒక్కోసారి ఈ వ్యాధి లక్షణాలు బాధితునిలో రెండు మూడు వారాల తర్వాత కనిపిస్తాయి. పారామిక్సోవైరస్ అనే వైరస్ కారణంగా ‘గవదబిళ్లలు’ వ్యాప్తి చెందుతుంది. ఇది బాధితుని నోటి నుంచి వెలువడే నీటి బిందువుల ద్వారా వ్యాపిస్తుంది. ఒక వ్యక్తి నుండి మరొకరికి ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ‘గవదబిళ్ల’ బారిన పడినవారికి మెదడు వాపు వచ్చే ప్రమాదం కూడా ఉండవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధి రాకుండా ఉండేందుకు మాస్కులు ధరించాలని, ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ వ్యాధి బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కలిగిన వ్యక్తులను అధికంగా ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధికి చికిత్స కొద్ది రోజుల పాటు కొనసాగుతుంది. యాంటీబయాటిక్స్‌తో ఈ వ్యాధి త్వరగా నయం కాదు. ‘గవదబిళ్ల’ బారినపడినవారు ఆమ్ల ఆహారాలకు దూరంగా ఉండాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. -
సింహ గర్జనకు దుమ్మురేపిన దున్నలు
సియోల్: ఒక్కోసారి ఎంతటి ప్రశాంతవాతవరణమైన రణరంగాన్ని తలపించొచ్చు. ఎంత శాంతంగా ఉన్న జీవైన భయంగుప్పిట్లోకి జారుకుందంటే తనకు తెలియకుండానే ప్రమాదబారిన పడటమో ప్రమాదంలో పడేయడమో చేయొచ్చు. దక్షిణాఫ్రికాలోని ఓ పెద్ద పార్క్‌లో ఇలాగే జరిగింది. అప్పటివరకు నిర్మలంగా.. చల్లటి గాలులు.. పచ్చని చెట్ల మధ్య పీస్ఫుల్ గా కనిపించిన ఆ రహదారి ఒక్కసారిగా దుమ్మురేగింది. భయం గుప్పిట్లోకి జారుకున్న అడవి దున్నలు చేసిన హంగామాకు ఆ రోడ్డుపై వెళుతున్న వాహనదారులు ఉలిక్కిపడ్డారు. వందల దున్నల టపాటపా తమ కార్లకు ఢీకొనడమే కాకుండా.. ఆ కార్లపై నుంచి కొన్ని దూకుతూ.. కార్లను తొక్కుతూ వెళ్లడంతో సచ్చాం రా దేవుడా అనుకొని కాసేపు ఊపిరి బిగబట్టుకున్నారు. దక్షిణాఫ్రికాలోని క్రూగ్ పార్క్‌లో విశాలమైన రహదారి ఉంది. ఈ రహదారి గుండా వెళుతూ టూరిస్టులు అటవీ జంతువును సందర్శిస్తుంటారు. అందులో భాగంగానే అప్పటికే కొన్ని వాహనాలు ముందుండగా ఓ రెండు కార్లు నెమ్మదిగా వెళుతున్నాయి. ఆ రోడ్డును అడవి దున్నలు ఎంతో ప్రశాంతంగా ఒక పద్థతిగా రోడ్డు దాటుతుండటంతో కాసేపు వార్లు కార్లు నిలుపుకున్నారు. అవి దాటేసి వెళ్లగానే కార్ల వేగం పెంచారు. ఈ లోగా అడవి రారాజు సింహం అరుపు వినిపించింది. దాంతో అప్పటికే ప్రశాంతంగా రోడ్డు దాటిన దున్నలన్నీ కూడా ఒక్కసారిగా తిరిగి మరోసారి రోడ్డు దాటేందుకు మెరుపు వేగంతో దూసుకొచ్చాయి. ఆ వందల దున్నలమధ్య ఆ రెండు కార్లు చిక్కుపోయాయి. ఏదో పెద్ద బాంబు పేలితే ఎంతటి దుమ్ముధూళి రేగుతుందో ఆ దున్నల పరుగుకు అంతటి దుమ్ము రేగింది. ఎన్నో దున్నల మధ్య తొక్కిసలాట కూడా చోటుచేసుకుంది. ఆ కార్లను చూసిన ఇతరులు ఆ దృశ్యం చూసి గుండెలు పట్టుకున్నారు. అదృష్టవశాత్తు ఏం కాలేదు.