గత రెండేళ్లుగా కరోనా మహమ్మారీతో పోరాడుతూ... ఇప్పుడిప్పుడే ఈ వ్యాధి నుంచి బయటపడుతున్నాం అనుకునేలోపే మరో వింత వ్యాధి కలకలం రేపింది. ఇది గత మే నెలలో కేరళలోని కొల్లంలో మొదలైంది. ఈ వ్యాధి రోగి శరీరంపై ఎర్రగా నొప్పితో కూడిన పొక్కులు వచ్చి టొమాటో సైజులో పెద్దవిగా ఉంటుంది. అందువల్ల దీనిని టోమోటో ఫ్లూ అని పిలుస్తారు.
దీని వల్ల చేతులు, పాదాలు, నోటి పై ఎర్రటి బాధకరమైన బొబ్బలు వస్తాయి . ఇప్పటి వరకు ఈ వ్యాధికి సంబంధించిన కేసులను కేరళ, ఒడిశాలో గుర్తించారు. సుమారు 82 మంది పిల్లలకు ఈ వ్యాధి భారిన పడినట్లు లాన్సెట్ రెస్పిరేటరీ జర్నల్ పేర్కొంది. ఈ వ్యాధి బారిన పడిన చిన్నారులంతా ఐదేళ్ల లోపు వారేనని తెలిపింది. ఇది పేగు వైరస్ వల్ల వస్తుందని, పెద్దల్లో అరుదుగా సంభవిస్తుందని చెప్పింది.
ఈ వ్యాధి బారిన పడిన రోగి అచ్చం చికెన్‌గున్యా లాంటి లక్షణాలను ఎదుర్కొంటాడని వెల్లడించింది. ప్రస్తుతం ఈ వ్యాధి కేరళలో అత్యధికంగా ప్రబలడం వల్ల తమిళనాడు, ఒడిశా, కర్ణాటక అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది. అదీగాక ఒడిశాలో భువనేశ్వర్‌లోని ప్రాంతీయ వైద్య పరిశోధన కేంద్రం సుమారు 26 పిల్లలు ఈ వ్యాధి బారిన పడినట్లు పేర్కొందని నివేదికలో వెల్లడించింది. ఇప్పటివరకు కేరళ, తమిళనాడు, ఒడిశా తప్ప భారత్‌లోని మరే ప్రాంతాలు ఈ వైరస్ బారిన పడలేదని లాన్సెట్ నివేదిక పేర్కొంది.
(చదవండి: Tomato Flu In Kerala: ‘టమాటో ఫ్లూ’ కలకలం.. చిన్నారుల్లో శరవేగంగా వ్యాపిస్తున్న వైనం)
Comments
Please login to add a commentAdd a comment