
రోహింగ్యాలపై దాడిని ఖండించిన ఐరాస
జెనీవా : మయన్మార్‌లోని రోహింగ్యా ముస్లింలపై జరుగుతున్న దాడిని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం తీవ్రంగా ఖండించింది. రోహింగ్యాలపై మయన్మార్‌లో జరుగుతును దాడులపై ఐరాస మండిపడింది. ఒక జాతిపై కక్ష గట్టినట్టు జరుగుతున్న దాడులకు అందరూ సిగ్గుపడాలని సమితి హ్యూమన్ రైట్స్ చీఫ్ జైదీ ఆల్ హసన్ అన్నారు. మయన్మార్‌లో యధేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు.