Rohingya
-
ఒకే ఆధార్, పాన్‌కార్డు.. పాస్పోర్టులెన్నో
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/కోరుట్ల: తీగ లాగితే పాస్‌పోర్టుల డొంకంతా కదులుతోంది. జగిత్యాల జిల్లా కోరుట్లతోపాటు కరీంనగర్, వేములవాడ, సిరిసిల్లలోనే ఈ రాకెట్‌కు ప్రధాన ఏజెంట్లు ఉన్నారు. ఇక్కడి చిరునామాలతో పలువురు రోహింగ్యాలు విదేశాలకు వెళ్లారన్న విషయాన్ని గుర్తించిన సీఐడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో వారికి పలు నిర్ఘాంతపోయే విషయాలు తెలుస్తున్నాయి. స్థానికులు, విదేశీయులు అన్న తేడా లేకుండా.. ఎవరికి పాస్‌పోర్టులు కావాలన్నా.. కేవలం కొన్నిరోజుల్లోనే వచ్చేలా చేయడంలో వీరిది అందెవేసిన చేయి. ఇప్పటివరకూ 92 మందిని దేశం దాటించగలిగారు. ఇలా వెళ్లిన వారిలో విదేశీయులు ఉండటంతో విషయాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. పైగా ఈ దందాకు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు సహకరించారన్న విషయాన్నీ ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. నాంపల్లి టు జగిత్యాల ఈ రాకెట్‌కు నాంపల్లికి చెందిన అబ్దుల్ సత్తార్ ఒస్మాన్ అల్ జవహరీ ప్రధాన సూత్రధారి. ఇతను నాంపల్లిలోని బడే మజీదు వద్ద నివసించే ఇతను డీటీపీ గ్రాఫిక్స్‌లో సిద్ధహస్తుడు. ఈ పనితోపాటు పాస్‌పోర్టు బ్రోకర్గాను పనిచేసేవాడు. నకిలీ విద్యార్హతలు, ఆధార్, పాన్‌కార్డు ఇలా కీలక నకిలీ డాక్యుమెంట్లు తయారు చేస్తూ గల్ఫ్ ఏజెంట్ల సర్కిల్లో బాగా పాపులర్ అయ్యాడు. వరంగల్, నిజామాబాద్, హైదరాబాద్ ప్రాంతాల్లోని బ్రోకర్లకు పాస్‌పోర్ట్‌లకు కావాల్సిన సర్టిఫికెట్లు సమకూర్చేవాడు. ఈ గ్యాంగ్ వద్ద దగ్గర దొరకని పత్రం అంటూ ఏదీ ఉండదు. విద్యార్హత, ధ్రువీకరణ పత్రం, ఆధార్, పాన్ ఏది కావాలన్నా నిమిషాల్లో రెడీ చేస్తాడు. కొందరు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు కూడా వీరికి సహకరించడంతో వీరి పని మరింత సులువై, పాస్‌పోర్టులు ఇప్పించి విదేశీయులను భారతీయులుగా దేశం దాటించగలిగారు. వీరు ఇప్పించిన పాస్‌పోర్టుల్లో అత్యధిక పాస్‌పోర్టులకు ఒకే ఆధార్, ఒకే ఫోన్ నంబరు ఉండటంతో విషయం వెలుగుచూసింది. ఈసీఎన్ఆర్ కేటగిరీలోనే.. ఇమిగ్రేషన్‌లో దొరికిపోకుండా తనిఖీలు అవసరం లేని ఈసీఎన్ఆర్ (ఇమిగ్రేషన్ చెక్ నాట్ రిక్వైర్డ్) కేటగిరీలోనే పాస్‌పోర్టులు ఇప్పించారు. ఇందుకు వారి నుంచి రూ.లక్షల్లో వసూలు చేశారు. చాలా పాస్‌పోర్టులకు ఒకే ఆధార్ కార్డు ఉండటం, కస్టమర్లందరికీ ఏజెంట్లు తమ ఫోన్ నంబరునే అటాచ్ చేసి ఉంచడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా సోదాలు చేసిన సీఐడీ అధికారులు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న 12 మంది నిందితులను అరెస్టు చేసి, ఫారినర్స్ యాక్ట్ 1946, పాస్‌పోర్ట్ యాక్ట్‌తోపాటు పలు సెక్షన్ల కింద కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి ఏజెంట్లు రాకెట్ సూత్రధారి అబ్దుల్ సత్తార్ తన నెట్‌వర్క్‌ను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాడు. అబ్దుల్ సత్తార్ ఉస్మాన్ అల్ జవహరీ నాంపల్లి (హైదరాబాద్)కి చెందినవాడు కాగా.. మిగిలిన మహ్మద్ ఖమ్రుద్దీన్, చాంద్‌ఖాన్, దేశోపంతుల అశోక్ రావు (కోరుట్ల), పెద్దూరి శ్రీనివాస్ (తిమ్మాపూర్, కరీంనగర్), గుండేటి ప్రభాకర్ (జగిత్యాల), పోచంపల్లి దేవరాజ్ (వేములవాడ, సిరిసిల్ల), అబ్దుల్ షుకూర్ (రాయికల్, జగిత్యాల). వీరంతా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వారే కావడం గమనార్హం. వీరంతా కలిసి ఎంతమందికి నకిలీ సర్టిఫికెట్లు ఇప్పించారు..? ఎంతమంది విదేశీయులకు పాస్‌పోర్టులు ఇప్పించారు..? అన్న విషయంపై సీఐడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇక్కడి చిరునామాలతో పలువురు కెనడా, మలేసియా, దుబాయ్, గల్ఫ్ దేశాలు, స్పెయిన్, ఫ్రాన్స్, థాయ్‌లాండ్, ఇరాక్ తదితర దేశాలకు వెళ్లినట్టు గుర్తించారు. వారంతా అక్కడ ఏం చేస్తున్నారు..? ఏ కంపెనీలో పనిచేస్తున్నారు..? అన్న విషయాన్ని కనిపెట్టే పనిలో నిమగ్నమయ్యారు. పదేళ్ల తర్వాత మళ్లీ... 2014లోనే డబుల్ పాస్‌పోర్ట్‌లు, వాటికి అవసరమైన నకిలీ ధ్రువీకరణ పత్రాలు తయారు చేస్తున్నారన్న ఆరోపణలతో కోరుట్లకు చెందిన ఖమరోద్దీన్, అశోక్‌రావు, చాంద్‌పాషాపై కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కొంతకాలం ఇక్కడ ఎలాంటి కార్యకలాపాలు జరగలేదు. శుక్రవారం సీఐడీ అధికారుల దాడులతో వీరంతా పాస్‌పోర్ట్ దందా ఆపలేదని రుజువైంది. -
ఉగ్రదాడి.. ఏడుగురు రోహింగ్యా వలసదారుల మృతి
బంగ్లాదేశ్: బంగ్లాదేశ్-మయన్మార్ సరిహద్దులోని రోహింగ్యా శరణార్థి శిబిరంలోని శిక్షణ సంస్థపై ముష్కరులు జరిపిన దాడుల్లో సుమారు ఏడుగురి చనిపోయినట్లు బంగ్లాదేశ్ పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు ముష్కరులు కొంతమందిని చంపేసి మరికొంత మంది పై కత్తులతో దాడి చేసినట్లు పోలీస్ చీఫ్ వెల్లడించారు. మూడు వారాల క్రితం రోహింగ్యా కమ్యూనిటీ నాయకుడిని అతని పై కాల్పుల జరిగిన సంగతి తెలిసిందే. (చదవండి: తింగరోడు.. లైవ్ టెలికాస్టింగ్‌లో ఫోన్ చోరీ! కట్ చేస్తే..) అయితే ఈ నేపథ్యంలోనే మయన్మార్ నుండి వచ్చిన దాదాపు 9 లక్షల మందికి పైగా ఉన్న శరణార్థుల శిభిరాల్లో ఉద్రిక్త వాతావరణ నెలకొనడంతోనే ఈ హత్యలు జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడి జరిగినపుడు నలుగురు వెంటనే చనిపోగా మిగతా ముగ్గురు బాలుఖాలి క్యాంప్‌లోని ఆసుపత్రిలో మరణించారని అన్నారు. ఈ మేరకు దాడి జరిగిన వెంటనే ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు సాయుధ బలగాల బెటాలియన్ ప్రాంతీయ చీఫ్ శిహాబ్ కైసర్ ఖాన్ తెలిపారు. (చదవండి: మోదీ జీ.. ప్రతిసారి నా కృత్రిమ కాలు తొలగించమంటున్నారు’) -
తక్షణమే చర్యలు తీసుకుంటాం!:బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి
బంగ్లాదేశ్: రోహింగ్యాల శరణార్థుల నాయకుడు మోహిబ్ ఉల్లాను హత్య చేసిన వారిపై సత్వరమే కఠిన చర్యలు తీసుకుంటామని బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఏకే అబ్దుల్ మోమెన్ హామీ ఇచ్చారు. అంతేకాదు ఈ అఘాయత్యానికి పాల్పడిన వారు తప్పించుకోలేరని వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. మోహిబ్ ఉల్లాను కాక్స్ బజార్లో కొంత మంది ముష్కరులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. (చదవండి: తల్లి చికిత్స కోసం కన్యత్వాన్ని అమ్మకానికి పెట్టిన బాలిక.. చివర్లో) 2017లో సైనిక దాడి కారణంగా ఏడు లక్షల మంది రోహింగ్యాలు మయాన్మార్ నుంచి పారిపోయి బంగ్లాదేశ్ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. అయితే మోహిబ్ ఉల్లా ఈ శరణార్థుల కోసం అర అరకాన్ రోహింగ్యా శరణార్థుల సోసైటిని ఏర్పాటు చేసి వారి హక్కులు, శాంతియుత జీవనం కోసం పోరాడుతున్న రోహింగ్యాల నాయకుడు . అంతేకాదు రోహింగ్యాల స్వదేశమైన మయాన్మార్లో వారిపై జరుగుతున్న దాడుల గురించి అంతర్జాతీయంగా వారి గళం వినిపించేలా ఒక డాక్యుమెంట్ కూడా ప్రిపేర్ చేశాడు. ఈ మేరకు రోహింగ్యాలు తమ స్వదేశానికి తిరిగే వెళ్లి జీవించే హక్కు ఉందని తాము కచ్చితంగా తమ స్వదేశానికీ తిరిగి వెళ్లాలన్నదే తన ఆశ అని కూడా వివరించాడు. ఈ క్రమంలోనే కొంతమంది దుండగులు తమ స్వార్థ ప్రయోజనాల దృష్ట్య అతనిని హత్య చేసి ఉండవచ్చని విదేశాంగ మంత్రి మోమెన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. పైగా మోహిబ్ ఉల్లా 2019లో తనకు చాలా బెదిరింపు కాల్స్ వచ్చాయని 'ఒక వేళ తాను మరణించిన బాగానే ఉంటాను, ప్రస్తుతం మాత్రం నేను నా ప్రాణన్ని ఇస్తాను' అంటూ అతను చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు. (చదవండి: వింత నమ్మకం.. పెరిగిన పార్లేజీ బిస్కెట్ల అమ్మకాలు) -
15 మంది రోహింగ్యాల దుర్మరణం
ఢాకా: బంగ్లాదేశ్‌లోని ఒక రోహింగ్యా క్యాంపులో చెలరేగిన మంటల కారణంగా 15మంది దుర్మరణం చెందగా 400 మంది కనిపించకుండా పోయారు. దాదాపు 45వేలమంది నివాసముండే ఈ క్యాంపులో అగ్నిప్రమాదం కారణంగా 10వేలకుపైగా గృహాలు దగ్ధమయ్యాయని ఐరాస అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 15 మృతదేహాలను వెలికితీశారు. 560మంది గాయాలబారిన పడ్డారు. క్యాంపులో అధికశాతం షెల్టర్లు వెదురుతో నిర్మించినవి కావడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని యూఎన్ రెఫ్యూజీ ఏజెన్సీ ప్రతినిధి జొహన్నాస్ వాండీర్ క్లావూ చెప్పారు. మంటల్లో నాలుగు ఆస్పుత్రులు, ఆరు హెల్త్ సెంటర్లు ధ్వంసమయ్యాయి. బర్మా నుంచి రోహింగ్యాల వలసలు ఆరంభమైనప్పటినుంచి ఇది అదిపెద్ద ప్రమాదమని బంగ్లా అధికారులు చెప్పారు. ఎంతమంది మరణించింది అధికారికంగా ప్రకటించలేదు. ప్రమాదంపై విచారణ జరుపుతున్నట్లు అధికారులు చెప్పారు. కాక్స్ బజార్లో దాదాపు 11 లక్షల మంది రోహింగ్యాలు వివిధ క్యాంపుల్లో ఆశ్రితులుగా ఉంటున్నారు. వీరిని బర్మా తరలించాలని భావించినా, ఆదేశంలో మిలటరీ పాలన రావ డంతో వీరి భవితవ్యంపై అయోమయం నెలకొంది. చదవండి: (అమెరికాలో మళ్లీ పేలిన తూటా.. 10 మంది మృతి) -
రోహింగ్యాకు అరదండాలు
సాక్షి, సిటీబ్యూరో: మయన్మార్ నుంచి బంగ్లాదేశ్ మీదుగా భారత్‌కు వలసవచ్చి, నగరంలో శరణార్థిగా స్థిరపడి, దేశ పౌరుడిగా ప్రకటించుకుని గుర్తింపుకార్డులు పొందిన రోహింగ్యాను దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను అక్రమమార్గంలో గుర్తింపుకార్డులు పొందడమేగాక వీటి ఆధారంగా కొన్ని ప్రభుత్వ పథకాల నుంచి లబ్ధిపొందినట్లు అనుమానిస్తున్నామని అదనపు డీసీపీ చక్రవర్తి పేర్కొన్నారు. బుధవారం ఆయన కేసు వివరాలు వెల్లడించారు. మయన్మార్‌లోని బుథీడంగ్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఫారూఖ్ 2009లో ప్రాంతాన్ని వదిలేశాడు. బంగ్లాదేశ్ మీదుగా భారత్‌లో ప్రవేశించిన ఇతను మూడేళ్లు జమ్మూకశ్మీర్‌లో ఉన్నాడు. 2011లో హైదరాబాద్ చేరుకున్న అతను జల్పల్లి ప్రాంతంలో స్ధిరపడ్డాడు. ఇతడికి ఐక్యరాజ్య సమితి జారీ చేసిన శరణార్థి కార్డు ఉంది. ఈ విషయం దాచి పెట్టిన ఫారూఖ్ తాను భారతీయుడినే అని క్లైమ్ చేసుకున్నాడు. మొఘల్‌పురలో రఫాయ్ ఆన్లైన్ మీ సేవా సర్వీస్ సెంటర్ నిర్వహిస్తున్న ఖదీరుద్దీన్ సహకారంతో ఓటర్ ఐడీ తదితర గుర్తింపులు పొందాడు. వీటి ఆధారంగా కొన్ని ప్రభుత్వ పథకాల నుంచి లబ్ధి పొందాడు. ఇతని వ్యవహారంపై సమాచారం అందుకున్న సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్.రాఘవేంద్ర నేతృత్వంలో ఎస్సైలు వి.నరేందర్, ఎన్.శ్రీశైలం, మహ్మద్ తఖ్రుద్దీన్ తమ బృందంతో వలపన్ని పట్టుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం ఇద్దరు నిందితులను మొఘల్‌పుర పోలీసులకు అప్పగించారు. -
తగునా ఇది సూకీ!
ఉన్నట్టుండి పాత్రలు తారుమారైతే, స్వరం మారిపోతే దిగ్భ్రాంతిపడటం... కలో నిజమో తెలియక కంగారుపడటం ఎలాంటివారికైనా తప్పదు. నోబెల్ శాంతి పురస్కార గ్రహీత ఆంగ్‌సాన్ సూకీ అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) ముందు హాజరుకావడం, ఈ శతాబ్దంలోనే అత్యంత దారుణమైన మానవ హననమని ప్రపంచమంతా ముక్తకంఠంతో నిరసించిన క్రౌర్యాన్ని కప్పెట్టే యత్నం చేయడం కళ్లారా చూసినవారికి అలాగే అనిపించింది. ఆంగ్‌సాన్ సూకీ సాధారణ మహిళ కాదు. పదిహేనేళ్లపాటు మయన్మార్ సైనిక దుశ్శాసకుల ఉక్కు నిర్బంధంలో మగ్గినా ఆమె మొక్కవోని పోరాట దీక్ష ప్రదర్శించారు. అలాంటి నాయకురాలు గత వారం ఐసీజే ముందు దాదాపు 30 నిమిషాలపాటు సైనిక పాలకులను సమర్థిస్తూ మాట్లాడటం ఎవరూ ఊహించలేరు. 2017లో మయన్మార్‌లో సైన్యం రోహింగ్యా తెగవారిపై విరుచుకుపడి గ్రామాలకు గ్రామాలు తగలబెట్టి, వేలాదిమందిని ఊచకోత కోసిన ఉదంతంపై దర్యాప్తు జరిపించి కారకులైనవారిని కఠినంగా దండించాలని ఆఫ్రికా ఖండంలోని అతి చిన్న దేశం గాంబియా ఐసీజేలో దాఖలు చేసిన ఫిర్యాదుపై జరిగిన విచారణకు ఆమె హాజరయ్యారు. మయన్మార్ సైన్యంపై వచ్చిన ఆరోపణలన్నీ సత్యదూరమని ఆమె గట్టిగా వాదించారు. తరచు సైనికులపైనా, పౌరులపైనా సాయుధ దాడులకు పాల్పడుతున్న ఆరకాన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ(అర్సా) సంస్థను అదుపు చేసేందుకు సైన్యం తీసుకున్న చర్యలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. 2017 ఆగస్టు 25న వేలాదిమంది అర్సా సాయుధులు 30 పోలీసు పోస్టులపైనా, గ్రామాలపైనా, రఖైన్‌లోని సైనిక స్థావరంపైనా దాడులు జరిపినప్పుడు సైన్యం వాటిని తిప్పికొట్టిందేతప్ప పౌరులను ఊచకోత కోసిందనడం అబద్ధమని సూకీ సెలవిచ్చారు. బాలికలపైనా, మహిళలపైనా అత్యాచారాలు జరిపిన సైనికులు, ఇళ్లల్లో చిన్న పిల్లల్ని నిర్దాక్షిణ్యంగా విసిరేశారని న్యాయమూర్తుల ముందు మహిళలు వాంగ్మూలం ఇస్తుండగా నిర్వికారంగా చూస్తూ ఉండిపోయిన సూకీ, ఆ మర్నాడు సైన్యాన్ని గట్టిగా వెనకేసుకొస్తూ ప్రసంగించిన తీరు అందరినీ నివ్వెరపరిచింది. దాదాపు అరవైయ్యేళ్లుగా సాగుతున్న సైనిక నియంతృత్వంనుంచి 2015లో మయన్మార్ విముక్తమైనట్టు కనిపించినా ఆ దేశంలో ఇప్పటికీ సైన్యానిదే ఆధిపత్యం. ఆంగ్‌సాన్ సూకీని విడుదల చేసి ఆమె రాజకీయ రంగ ప్రవేశానికి సైనికాధిపతులు అనుమతించినా, దేశాధినేత కాకుండా నిబంధనలు పెట్టారు. కనుక ప్రధాని పదవితో సమానమైన స్టేట్ కౌన్సిలర్ హోదాలో మాత్రమే ఆమె కొనసాగుతున్నారు. ఇప్పుడు రోహింగ్యాల విషయంలో వారి అభీష్టాన్ని కాదంటే ఆ పదవి కూడా ఉండదన్న ఆందోళనతో సైనిక పాలకులకు సూకీ వంతపాడుతున్నారు. మయన్మార్ సైన్యం తమ దురాగతాలకు సాక్ష్యాలు లేకుండా చేయడం కోసం గ్రామాలకు గ్రామాలను కాల్చి బూడిద చేసింది. కొందరు ఆరోపిస్తున్నట్టు తమ సైనికులు అత్యాచారాలకు పాల్పడలేదని, పౌరుల్ని కాల్చి చంపలేదని వాదించడానికి అసలు రోహింగ్యాలు చెబుతున్నచోట గ్రామాలే లేవని బుకాయించడం కోసమే దీన్నంతటినీ సాగించారు. అయితే ఉపగ్రహ ఛాయా చిత్రాలు జరిగిందేమిటో స్పష్టంగా వెల్లడిస్తున్నాయి. ఇదే ఊచకోత మయన్మార్‌లో కాక మరోచోట జరిగుంటే అగ్రరాజ్యాలు తెగ ఆవేశపడేవి. ఆ దేశానికి సైన్యాన్ని తరలించేవి. పాలకుల్ని బెదిరించేవి. కానీ మయన్మార్ విషయంలో అది చెల్లుబాటు కాదు. దురాక్రమణకు ప్రయత్నిస్తే పొరుగునున్న చైనా దాన్నంతటినీ చూస్తూ ఊరుకోదు. ఆ దేశ పాలకులకు వత్తాసుగా ముందుకొస్తుంది. అందుకు సిద్ధపడదామనుకున్నా అదేమంత లాభసాటి కాదు. భూగోళంపై ఏమూల సహజవనరులున్నా వాలిపోయే తమ దేశంలోని కార్పొరేట్లకు రోహింగ్యాల గడ్డ రఖైన్ ఏమాత్రం పనికొచ్చే భూమి కాదు. అక్కడున్న సహజ వనరులు అతి స్వల్పం. కొద్దిమంది పౌరులకు పనికల్పించేందుకు కూడా ఆ వనరులు పనికి రావు. ఇక లాభాల మాటే లేదు. ప్రపంచంలో ముస్లింలకు తామే ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్పుకునే దేశాలు చాలావున్నాయి. అందులో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియావంటి సంపన్న దేశాలున్నాయి. కండబలం ప్రదర్శించడానికి వెనకాడని టర్కీ ఉంది. ఇస్లామిక్ దేశాల సంస్థ(ఓఐసీ) వంటివున్నాయి. ఎవరికీ రోహింగ్యాల వెతలు పట్టలేదు. కళ్లముందు అన్యాయం జరుగుతుంటే దాన్ని ఎదిరించడానికి లేదా కనీసం అది తప్పని చెప్పడానికి దండిగా డబ్బు, కండబలం ఉండక్కర్లేదు. కాస్తంత నైతికబలం ఉంటే చాలు. కనీసం ఆఫ్రికా ఖండంలో ఎక్కడుందో ఎవరికీ తెలియని గాంబియా చేసింది ఆ పనే. అది మయన్మార్‌కు 11,265 కిలోమీటర్ల దూరానుంది. అయినా స్పందించింది. కడవలకొద్దీ కన్నీళ్లు కార్చడం తప్ప, రోహింగ్యాల కోసం ఏమీ చేయని బడా దేశాలు సిగ్గుపడేలా ఈ దారుణాన్ని ఐసీజే దృష్టికి తీసుకురావాలని అది నిర్ణయించింది. ఇప్పుడు ఐసీజేలో సైనిక దురాగతాలను వెనకేసుకొచ్చిన సూకీ వారి బాటలోనే కనీసం రోహింగ్యాల పేరెత్తడానికి కూడా ఇష్టపడలేదు. ఒకే ఒక్క సందర్భంలో... అది కూడా ‘అర్సా’ గురించి చెప్పవలసి వచ్చిన సందర్భంలో ఆ పేరు ప్రస్తావించారు. కనీస అవసరాలైన తిండి, బట్ట, ఆవాసం, వైద్యం వంటివి లేక తరతరాలుగా రోహింగ్యాలు ఇబ్బందులు పడుతున్నారు. సైన్యం ఆగడాలతో పొరుగునున్న బంగ్లాదేశ్‌కు పోయి అత్యంత దైన్యస్థితిలో శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ఇప్పుడు జరిగింది ఐసీజే విచారణ మాత్రమే. ఇందులో దోషులెవరో తేల్చడానికి ఏళ్లూ పూళ్లూ పడుతుంది. బంగ్లాదేశ్‌లో ఉన్న రోహింగ్యాలను వెనక్కి తీసుకొచ్చి, అంతా సవ్యంగా ఉందని చెప్పడం కోసం 2017 నవంబర్‌లో మయన్మార్ ఆ దేశంతో అవగాహనకొచ్చింది. అయితే కనీస హక్కులకు గ్యారెంటీ ఇస్తే తప్ప వెనక్కి వెళ్లేందుకు వారు సుముఖంగా లేరు. ఐక్యరాజ్యసమితి సంస్థల ద్వారా వారికి అండదండలందించి, వారు మనుషులుగా బతకడానికి సాయపడటం ప్రపంచ దేశాల కర్తవ్యం. -
ఐరాసకు ఆ హక్కు లేదు
యాంగాన్: తమ దేశ ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు ఐక్యరాజ్యసమితికి లేదని మయన్మార్ సైనిక ప్రధానాధికారి మిన్ అంగ్ స్పష్టం చేశారు. రొహింగ్యా మారణకాండపై చర్చించేందుకు ఐరాస సర్వప్రతినిధి సభ సమాయత్తమవుతుండగా ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. గత ఏడాది ఆగస్టు నుంచి మయన్మార్ సైనికుల అత్యాచారాలు, దాడులు, గృహ దహనాలకు భీతిల్లిన రొహింగ్యా ముస్లింలు లక్షలాదిగా పొరుగునే ఉన్న బంగ్లాదేశ్‌లో తలదాచుకుంటున్నారు. మయన్మార్ సైనిక మారణకాండపై ఐరాస నిజ నిర్ధారణ కమిటీ ఒక నివేదిక రూపొందించింది. సైనికాధికారి మిన్ అంగ్ సహా మయన్మార్ అగ్రశ్రేణి సైనికాధికారులపై అంతర్జాతీయ నేర న్యాయస్థానంలో విచారణ చేపట్టా ల్సిందిగా కోరింది. దీంతోపాటు సైనికాధికారులు రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం మానాలంది. ఈ నివేదికపై స్పందించిన మిన్ అంగ్ వ్యాఖ్యలను సైన్యం నడిపే వార్తాపత్రిక ప్రచురించింది..‘ఏ దేశానికి గానీ, సంస్థకు గానీ మరో దేశం అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు, నిర్ణయాలు తీసుకునే హక్కు లేవు. ఇటువంటి చర్యలు అపార్థాలకు దారి తీస్తాయి’ అని తెలిపారు. నోబెల్ బహుమతి గ్రహీత అంగ్ సాన్ సూకీ నేతృత్వంలో బర్మాలో ప్రజాప్రభుత్వం ఏర్పడినప్పటికీ సైన్యమే కీలకంగా ఉంది. -
రోహింగ్యాల విషయమై కేంద్రానికి సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ : మయన్మార్ (బర్మా) దేశంలో మత పరమైన దాడులు ఎదుర్కొని, ఆ దేశ సైన్యం చేత తరిమివేయబడ్డ అమాయక ప్రజలు రోహింగ్యాలు. మన దేశానికి వలస వచ్చి వారు ఆశ్రయం పొందుతున్న ప్రాంతాలను సందర్శించి వారిపై ఒక నివేదిక తయారు చేయాల్సిందిగా సుప్రీం కోర్టు కేంద్రాన్ని, మరో మూడు రాష్ట్రాలను ఆదేశించింది. గతంలో రోహింగ్యాలు దేశంలోకి అక్రమంగా ప్రవేశించారని వారిని వెనక్కి పంపిస్తామని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. కానీ శరణార్థులగా వచ్చిన వారి విషయంలో అలా వ్యవహరించడం సరికాదంటూ కేంద్రానికి మోట్టికాయ వేసిన సుప్రీం కోర్టు ముందు వారిని అక్కున చేర్చుకుని తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా సూచించింది. అయితే మయన్మార్‌లో ఇంకా అక్కడి మైనారిటీలపై దాడులు జరుగుతునే ఉన్నాయి. భారతదేశానికి వేల సంఖ్యలో రోహింగ్యాలు వలస వచ్చారు. శరణార్థి శిబిరాలలో తలదాచుకుని కొంతమంది. చిన్న చిన్న గూడరాలు వేసుకుని కూలి పనులు చేసుకుని బతుకు సాగిస్తున్నారు. వారి జీవన స్థితిగతులు, ఉపాధి అవకాశాలను అంచనా వేసి వారిని తిరిగి వారి దేశానికి పంపాల లేదా అనే అంశాన్ని తేల్చనుంది ప్రభుత్వం. -
స్వదేశానికి రోహింగ్యాలు!
యాంగాన్: ఆరునెలలుగా బంగ్లాదేశ్, మయన్మార్ దేశాలకు చిక్కుముడిగా ఉన్న రోహింగ్యా ముస్లిం శరాణార్థుల విషయంపై ఇరుదేశాలు ముందడుగు వేశాయి. బంగ్లాదేశ్‌లో ఉంటున్న రోహింగ్యా శరణార్థులను తిరిగి స్వదేశానికి రప్పించేందుకు మయన్మార్ అంగీకరించింది. ఈమేరకు ఈ రెండు దేశాల మధ్య మయన్మార్ రాజధాని నేపిదాలో గురువారం ఒప్పందం కుదిరింది. ఇందుకు సంబంధించి మయన్మార్ నేత అంగ్ సాన్ సూకీ, బంగ్లాదేశ్ విదేశాంగమంత్రి మహమ్మూద్ అలీ ఒప్పంద పత్రంపై సంతకాలు చేసినట్లు మయన్మార్ కార్మిక శాఖ కార్యదర్శి మీంట్ కయాంగ్ మీడియాకు తెలిపారు. మయన్మార్‌లోని రఖానే రాష్ట్రంలో ఆ దేశ సైనికులు రోహింగ్యా ముస్లింలపై హింసకు పాల్పడటంతో అక్కడ్నుంచి 6,20,000 మంది రోహింగ్యాలు బంగ్లాదేశ్‌కు వలస వచ్చేశారు. -
రోహింగ్యాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
-
రోహింగ్యాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
మానవహక్కులు.. జాతీయ భద్రత మధ్య సమతూకం పాటించాలి రోహింగ్యాల దుస్థితిపై కేంద్రం సున్నితంగా వ్యవహరించాలి మేం నిర్ణయించే వరకు వారిని పంపించకూడదు సర్వోన్నత న్యాయస్థానం స్పష్టీకరణ సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని రోహింగ్యా ముస్లింలను పంపించే విషయమై సుప్రీంకోర్టు శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేసింది. రోహింగ్యాల దుస్థితిపై కేంద్ర ప్రభుత్వం సున్నితంగా వ్యవహరించాలని సూచించింది. దేశంలోని శరణార్థుల సమస్యను ఎదుర్కొనే విషయంలో మానవ హక్కులు, జాతీయ భద్రత మధ్య సమతూకం పాటించాల్సిన అవసరముందని పేర్కొంది. అమాయక రోహింగ్యా మహిళలు, చిన్నారుల దుస్థితిని కోర్టు చూసీచూడకుండా వదిలేయలేదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. రోహింగ్యాల విషయంలో మానవ హక్కుల, జాతీయ భద్రత మధ్య సమతూకం పాటించాలని, ఈ విషయంలో అనేక అంశాలను పరిగణించాల్సిన అవసరముందని పేర్కొంది. ఈ విషయంలో తాము నిర్ణయం తీసుకునే వరకు దేశంలోని రోహింగ్యాలను డిపోర్ట్ చేయకూడదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. రోహింగ్యాలను పంపించే విషయంలో ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకుంటే పిటిషనర్ తమను ఆశ్రయించవచ్చునని తెలిపింది. దేశంలోని రోహింగ్యా శరణార్థుల తరఫున ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. దేశంలోని రోహింగ్యాలు శరణార్థులు కాదని, వారు అక్రమ వలసదారులని, వారు దేశభద్రతకు ముప్పుగా పరిణమించారని, చట్టప్రకారం వారు దేశంలో నివసించడం కుదరదని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో కేంద్ర ప్రభుత్వం పేర్కొన్న సంగతి తెలిసిందే. -
రోహింగ్యా.. రోదన: సూచీకి షాక్..
లండన్: మయన్మార్‌లో రోహింగ్యాల ఆక్రందన కొనసాగుతూనే ఉంది. ఈ విషయంలో నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్న మయన్మార్ అనధికార ప్రభుత్వాధినేత ఆంగ్‌సాన్ సూచీకి ఆక్స్ఫర్డ్ సిటీ కౌన్సిల్ షాక్ ఇచ్చింది. ఆమెకు గౌరవసూచకంగా ప్రదానం చేసిన 'ఫ్రీడమ్ ఆఫ్ ఆక్స్ఫర్డ్' బిరుదును వెనుకకు తీసుకుంది. మయన్మార్ నియంత పాలనలో ప్రజాస్వామ్యం కోసం పోరాడినందుకు 1997లో ఆక్స్ఫర్డ్ కౌన్సిల్ ఆమెకు ఈ గౌరవాన్ని ప్రకటించింది. మంగళవారం భేటీ అయిన కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా ఆమెకు ప్రకటించిన గౌరవ బిరుదును వెనుకకు తీసుకుంది. ఆమె ఈ గౌరవానికి ఇక ఎంతమాత్రం అర్హురాలు కాదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. సిటీ కౌన్సిల్ చరిత్రలో ఇది అసాధారణ చర్య అని కౌన్సిల్ లీడర్ బాబ్ ప్రైస్ తెలిపారు. నోబెల్ శాంతి పురస్కార గ్రహీత అయిన సూచీకి ఆక్స్ఫర్డ్ నగరంతో మంచి అనుబంధం ఉంది. 1964-67 మధ్య ఇక్కడే సెయింట్ హ్యుగ్ కాలేజీలో చదివిన ఆమె.. కొంతకాలం ఇక్కడ కుటుంబంతో కలిసి నివసించారు కూడా. ఇటీవల సెయింట్ హ్యూగ్ కాలేజీ ప్రవేశమార్గంలో ఉన్న ఆమె చిత్రాన్ని తొలగించారు. ఈ నేపథ్యంలోనే సిటీ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మయన్మార్ రఖైన్ రాష్ట్రంలో ముస్లిం మైనారిటీలైన రోహింగ్యాల దుస్థితి కొనసాగుతోంది. ఇక్కడ తలపెట్టిన ఆర్మీ ప్రేరేపిత హింస, సంఘర్షణ నుంచి తప్పించుకునేందుకు ఇప్పటికే 50వేలకుపైగా మంది రోహింగ్యాలు నిరాశ్రయులయ్యారు. శరణార్థులుగా పొరుగు దేశాలకు వలస పోతున్నారు. -
మొబైల్ కనెక్షన్స్ ఇవ్వకండి?!
ఢాకా : రోహింగ్యా శరణార్థులకు మొబైల్ ఫోన్ కనెక్షన్లు ఇవ్వరాదని టెలికామ్ సంస్థలకు బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. అంతర్గత భద్రత, టెర్రరిస్ట్ కార్యకలాపాలకు ఆస్కారముండడంతో బంగ్లాదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మయన్మార్ నుంచి బంగ్లాదేశ్‌కు మొత్తం 4 లక్షల 30 వేల మంది రోహింగ్యాలు శరణార్థులుగా వచ్చారు. వీరెవరికీ మొబైల్ సదుపాయాలు కల్పించరాదనే కఠిన నిర్ణయం తీసుకుంది అక్కడి ప్రభుత్వం. దీనిపై టెలికామ్ మంత్రి ఇనాయత్ హుస్సేన్ మాట్లాడుతూ.. దేశంలోని నాలుగు టెలికామ్ సంస్థలకు ఈ ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. రోహింగ్యాల వద్ద మొబైల్స్ ఉన్నాయని.. స్థానికత లేని వారికి సిమ్‌కార్డులు ఇవ్వడం అనేది దేశ భద్రతకు ముప్పుగా మారే అవకాశముందని చెప్పారు. ఇప్పటికే బంగ్లా పౌరసత్వ అధికార ధృవీకరణ పత్రం లేకుండా సిమ్ కార్డులు జారీ చేయడాన్ని నిషేధించినట్లు ఆయన తెలిపారు. మయన్మార్ నుంచి వలస వచ్చిన రోహింగ్యాలను కేవలం మానవతా దృక్ఫథంతోనే బంగ్లాదేశ్ ఆశ్రమం కల్పించిందని.. అదే సమయంలో మా దేశ అంతర్గత భద్రత మాకు ముఖ్యమని మరో మంత్రి తరానా హాలీమ్ చెప్పారు. శరణార్థి రోహింగ్యాలు ఆశ్రయం పొందుతున్న కాక్స్ బజార్‌ను డేగకన్నుతో పరిశీలిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఎటువంటి సమస్యలు ఉత్పన్నమవుతాయని స్పష్టంగా వివరణ చేయకున్నా.. పూర్తి స్థాయిలో రక్షణ, భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు హాలీమ్ చెప్పారు. -
శరణార్థులు ఆగినట్టేనా?
ఢాకా : రోహింగ్యా వలసలకు కాస్త విరామం వచ్చిందని బంగ్లాదేశ్ శనివారం ప్రకటించింది. మయన్మార్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డ తరువాత.. ఇప్పటివరకూ బంగ్లాదేశ్‌కు సుమారు 4 లక్షల 30 వేల మంది రోహింగ్యాలు శరణార్థులుగా వచ్చారని ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. బంగ్లా-మయన్మార్ సరిహద్దు ప్రాంతంలో ఏర్పాటు చేసిన శరణార్థి శిబిరాల్లో రోహింగ్యాలు కిక్కిరిసి ఉన్నారని ఐక్యరాజ్య సమితి, బంగ్లాదేశ్ అధికార వర్గాలు చెబుతున్నాయి. రెండు రోజుల నుంచి మయన్మార్ సరిహద్దుల నుంచి, నాఫ్ నదినుంచి శరణార్థులు రావడం లేదని సరిహద్దు భద్రతా బలగాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితిని గమనిస్తుంటే.. ఇక రోహింగ్యా శరణార్థుల ప్రవాహం ఆగినట్టే ఉందని బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (బీజీబీ) కమాండర్ ఎస్.ఎం. ఆరిఫుల్ ఇస్లామ్ చెప్పారు. ఇదిలా ఉండగా.. శరణార్థుల సంఖ్యను రోజువారీ గణాంకాలను వెల్లడించాలని ఐక్యరాజ్యసమితి కోరినట్లు ఆయన చెప్పారు. సమితి తీసుకున్న చర్యల వల్లనే రోహింగ్యాల ప్రవాహానికి అడ్డుకట్ట పడి ఉండొచ్చని ఆయన అన్నారు. రోహింగ్యా మిలిటెంట్ల ఏరివేతను ఆపుతన్నట్లు మయన్మార్ నేత ఆంగ్‌సాన్ సూకీ గత వారం చేసిన ప్రకటనతో కొంతవరకూ ఫలితం వచ్చి ఉంటుందని మరో అధికారి మంజ్రుల్ హసన్ ఖాన్ చెప్పారు. ఆగస్టు 25న పోలీస్ పోస్ట్‌లపై రోహింగ్యా మిలిటెంట్లు దాడి చేసిన తరువాత.. సైన్యం ప్రతీకార చర్యలకు దిగడంతో మయన్మార్‌లో ఉద్రిక్త పరిస్థితులు చెలరేగాయి. దీంతో రోహింగ్యాలు మయన్మార్‌ను వీడి బంగ్లాకు శరణార్థులుగా వెళ్లారు. -
అంతు లేని కథ
-
రోహింగ్యాలు : ఒక్కరు కూడా అడుగుపెట్టొద్దు
సాక్షి, న్యూఢిల్లీ : మయన్మార్ నుంచి రోహింగ్యా శరణార్థులు, మిలిటెంట్లు దేశంలోకి ప్రవేశించే అన్నిదారులను కేంద్ర ప్రభుత్వం మూసేస్తోంది. తాజాగా రోహింగ్యాలు దేశంలోకి ప్రవేశించే అవకాశం ఉందన్న అంతర్గత నిఘా వర్గాల సమాచారంతో కేంద్ర ప్రభుత్వం మిజోరామ్-మయన్మార్ సరిహద్దు వెంబడి భద్రతను అత్యంత కట్టుదిట్టం చేసింది. సరిహద్దులో అస్సాం రైఫిల్స్ విభాగంతో భద్రతను పెంచినట్లు హోంమంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి ఒకరు మంగళవారం చెప్పారు. మయన్మార్ సరిహద్దు భద్రతపై మంగళవారం కేంద్ర హోంమంత్రిత్వశాఖ పలు దఫాలుగా చర్చలు జరిపింది. ప్రధానంగా మిజోరామ్ పోలీస్, పార్లమెంటరీ ఫోర్సెస్, ఇంటెలిజెన్స్, మిజోరామ్ రాష్ట్రప్రభుత్వంతో సరిహద్దు పరిస్థితిపై రివ్యూ జరిపింది. మయన్మార్ నుంచి ఒక్క రోహింగ్యా ముస్లిం కూడా సరిహద్దు దాటి దేశంలోకి ప్రవేశించరాదని కేంద్రం ఆదేశించినట్లు ఆయన చెప్పారు. మయన్మార్‌తో మిజోరామ్‌కు మొత్తం 404 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. -
ఏకం కావల్సిన సమయం ఇదే?!
రోహింగ్యాల మూలాలు లేవు వాళ్లంతా బంగ్లా వలసదారులే రోహింగ్యాలకు ఉగ్రవాదులతో సంబంధాలు యాంగాన్ : రోహింగ్యాల విషయంలో మయన్మార్ వాసులంతా ఏకం కావాలని.. ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ మిన్ ఆంగ్ హలియాంగ్ ఆదివారంనాడు పిలుపునిచ్చారు. మయన్మార్‌లో రోహింగ్యాల మూలాలు ఎక్కడా లేవని.. ఆయన పేర్కొన్నారు. గత నెల 25న రోహింగ్యా మిలిటెంట్లు పోలీస్ పోస్ట్‌లపై క్రమపద్ధతిలో దాడులు చేశారని అన్నారు. ఈ ఘటన అనంతరమే సైన్యం ఉత్తర రఖైనే రాష్ట్రంలో మిలిటెంట్ల ఏరివేతకు దిగింది. మిలిటెంట్ల ఏరివేతకు ప్రయత్నిస్తున్న తరుణంలో భారీగా హింస చెలరేగింది. దీంతో సరిహద్దుల్లో ఉన్న 4 లక్షల మంది రోహింగ్యాలు బంగ్లాకు శరణార్థులుగా వెళ్లారని.. చెప్పారు. అంతర్జాతీయ సమాజం, ఐక్యరాజ్యసమితి పేర్కొంటున్నట్లు.. జాతి నిర్మూలనకు మా సైన్యం దిగలేదని ఆర్మీ చీఫ్ స్పష్టం చేశారు. అసలు రోహింగ్యాల మూలాలు మా దేశంలో ఎందుకుంటాయని ఆయన ఎదురు ప్రశ్నించారు. మయన్మార్‌కు స్వతంత్రం వచ్చాక.. నాటి తూర్పుపాకిస్తాన్ (నేటి బంగ్లాదేశ్) నుంచి వేల సంఖ్యలో ప్రజలు ఇక్కడకు వలస వచ్చారని.. వారే తరువాత రోహింగ్యా ముస్లింలుగా స్థిరపడ్డారని ఆర్మీ చీఫ్ చెబుతున్నారు. రోహింగ్యాలకు వ్యతిరేకంగా చాలా ఏళ్ల నుంచి సైన్యం వ్యతిరేక ప్రచారం చేస్తోందని తెలుస్తోంది. ఈ కారణం వల్లే స్థానిక బౌద్ధులు.. సైన్యానికి పూర్తిగా సహకరిస్తున్నారు. ఇదిలా ఉండగా.. దేశ సరిహద్దులు దాటి శరణార్థులుగా వెళ్లిన రోహింగ్యాలను ఇక దేశంలోకి అనుమతించేదిలేదంటూ మయన్మార్ ప్రభుత్వం సూచనప్రాయంగా ప్రకటించింది. వలస వెళ్లిన రోహింగ్యాలకు అంతర్జాతీయ ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని సైన్యాధిపతి స్పష్టం చేస్తున్నారు. -
రోహింగ్యాలను హింసిస్తున్న సైన్యం : అమ్నెస్టీ
ఢాకా: రోహింగ్యాలపై ఒక క్రమపద్దతిలో మయన్యార్ సైన్యం హింసిస్తోందని అమ్నెస్టీ సంస్థ ప్రకటించింది. అమ్నెస్టీ ప్రకటనతో మయన్మార్‌పై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు. అమ్నెస్టీ నివేదికపై ఐక్యరాజ్యసమితి కార్యదర్శి రెక్స్ టెలిర్సన్ మాట్లాడుతూ రోహింగ్యాలపై దాడులు చేయడాన్ని, వారు నివసిస్తున్న గ్రామాలపై సైన్యం దాడి చేస్తూ వారిని ఒక క్రమపద్ధతిలో హింసించడాన్ని ఎవరూ సమర్ధించరని అన్నారు. మయన్మార్‌లో బౌద్ధులు-రోహింగ్యాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో.. 3 లక్షల 91 వేలమంది వలస వెళ్లినట్లు ఆయన ప్రకటించారు. ఇంత భారీ సంఖ్యలో ఒక జాతికి చెందిన వ్యక్తులు వలస వెళ్లడం ఇదే తొలిసారి కావచ్చని రెక్స్ టెలిర్సన్ చెప్పారు. మయన్మార్‌లో గ్రామాలకు గ్రామాలను వదలి రోహింగ్యాలు ప్రాణరక్షణ కోసం వెళుతున్నారని చెప్పారు. ప్రస్తుత దారుణ పరిస్థితులను చక్కదిద్దేందుకు సహకరించాలని ఆంగ్‌సాన్ సూకీని కోరినట్లు రెక్స్ తెలిపారు. -
బంగ్లాకు మానవతాసాయం
న్యూఢిల్లీ : మయన్మార్ నుంచి వేల సంఖ్యలో బంగ్లాదేశ్‌కు వస్తున్న రోహింగ్యాలను ఆదుకునేందుకు మానవతాదృక్ఫథంతో భారత్ చేయూతను అందిస్తోంది. రోహింగ్యా శరణార్థులను ఆదుకునేందుకు పునరావాస సాయం కింద భారత్ ఆహార పదార్థాలను అందిస్తోంది. పాలు, పళ్లు, చక్కెర, ఉప్పు, వంటనూనెలు, టీ, బిస్కెట్లు, దోమతెరలు, ఇతర అవసరమైన పదార్థాలతో గురువారం ఉదయం ఒక కంటెయినర్ బంగ్లాదేశ్‌కు బయలుదేరింది. ఈ కంటెయినర్ ఈ రోజు రాత్రి చిట్టిగాంగ్ చేరుకునే అవకాశం ఉంది. భారత్-బంగ్లాదేశ్ మధ్య ఉన్న స్నేహసంబంధాల వల్ల ఆ దేశంలో ఏ సమస్య వచ్చినా భారత్ వేగంగా స్పందిస్తుందని విదేశాంగ శాఖ తెలిపింది. బంగ్లాకు ఎటువంటి సహాయం కావాలన్నా వెంటనే అందిస్తామని కూడా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మయన్మార్‌లో నెలకొని ఉన్న ఉద్రక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడి నుంచి సుమారు 3 లక్షల 80 వేల ముంది రోహింగ్యాలు బంగ్లాదేశ్‌కు వలసవచ్చినట్లు అంచనాలు ఉన్నాయి. రోహింగ్యా మిలిటెంట్లు మయన్మార్‌లోని పోలీస్ అవుట్ పోస్ట్‌లపై దాడి చేయడంతో హింస చెలరేగిందని తెలుస్తోంది. -
రోహింగ్యాలపై దాడిని ఖండించిన ఐరాస
జెనీవా : మయన్మార్‌లోని రోహింగ్యా ముస్లింలపై జరుగుతున్న దాడిని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం తీవ్రంగా ఖండించింది. రోహింగ్యాలపై మయన్మార్‌లో జరుగుతును దాడులపై ఐరాస మండిపడింది. ఒక జాతిపై కక్ష గట్టినట్టు జరుగుతున్న దాడులకు అందరూ సిగ్గుపడాలని సమితి హ్యూమన్ రైట్స్ చీఫ్ జైదీ ఆల్ హసన్ అన్నారు. మయన్మార్‌లో యధేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. -
రోహంగ్యా రోదన
-
మయన్మార్‌లో సైనిక అత్యాచారాలు!
నేపితా/యాంగాన్: మయన్మార్ రాఖిన్ రాష్ట్రంలో గత కొద్ది వారాలుగా జాతి హింసాకాండ కొనసాగుతుండటంతో వేలాది మంది ‘రోహింగ్యా’ మైనారిటీ శరణార్థులు పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌కు వలసపోతున్నారు. ‘మాపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇళ్లు కాల్చేస్తున్నారు. కుటుంబ సభ్యులను ఉరితీస్తున్నారు. 10 ఏళ్లు పైబడిన వారు కనిపిస్తే చాలు.. సైన్యం వాళ్లను చంపేస్తోంది’ అని కొందరు శరణార్థులు పేర్కొన్నట్లు సీఎన్ఎన్ తెలిపింది. ‘నా భర్త బతికున్నాడో లేదో కూడా తెలియదు’ అని బంగ్లాదేశ్‌లోని కుటుపలాంగ్ క్యాంప్‌లో తలదాచుకుంటున్న లాలు బేగం తెలిపింది. ‘అందమైన ఆడవాళ్లు కనిపిస్తే చాలు. నీళ్లు కావాలని అడుగుతారు. మహిళ ఇంట్లోకి వెళ్లగానే లోపలికి పోరుు అత్యాచారం చేస్తారు’ అంటూ పేర్కొంది. పది లక్షల మంది రాహింగ్యాలు రాఖిన్లో శరణార్థులుగా ఉంటున్నారు. అరుుతే మయన్మార్ ప్రభుత్వం వారిని అధికారికంగా గుర్తించలేదు. అక్రమంగా వలస వచ్చిన బెంగాలీలుగానే భావిస్తోంది. ఉద్దేశపూర్వకంగానే స్పందించట్లేదు.. రోహింగ్యా ముస్లింల విషయంలో ఆంగ్‌సాన్ సూచీ ఉద్దేశపూర్వకంగానే మౌనం వహిస్తున్నారని మయన్మార్ పౌర హక్కుల సంఘాలు ఆరోపించారుు. సైన్యం దాష్టీకాలకు సాక్ష్యాధారాలు ఉన్నప్పటికీ సూచీ మౌనంగా ఉంటున్నారని విమర్శించారుు. మయన్మార్‌లో రోహింగ్యా ముస్లింల ‘సామూహిక బహిష్కరణ’ జరుగుతోందని, వేల మంది బంగ్లాదేశ్‌కు వలస వెళ్తున్నారని ఐక్యరాజ్య సమితి తెలిపింది. సూచీ ఉదాసీనత వల్లే ఇదంతా జరుగుతోందని, ఆర్మీపై ఆమెకు నియంత్రణ లేదని హ్యూమన్ రైట్స్ వాచ్ నేత డేవిడ్ మాథిసన్ ఆరోపించారు.