బంగ్లాదేశ్: బంగ్లాదేశ్-మయన్మార్ సరిహద్దులోని రోహింగ్యా శరణార్థి శిబిరంలోని శిక్షణ సంస్థపై ముష్కరులు జరిపిన దాడుల్లో సుమారు ఏడుగురి చనిపోయినట్లు బంగ్లాదేశ్ పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు ముష్కరులు కొంతమందిని చంపేసి మరికొంత మంది పై కత్తులతో దాడి చేసినట్లు పోలీస్ చీఫ్ వెల్లడించారు. మూడు వారాల క్రితం రోహింగ్యా కమ్యూనిటీ నాయకుడిని అతని పై కాల్పుల జరిగిన సంగతి తెలిసిందే.
(చదవండి: తింగరోడు.. లైవ్ టెలికాస్టింగ్‌లో ఫోన్ చోరీ! కట్ చేస్తే..)
అయితే ఈ నేపథ్యంలోనే మయన్మార్ నుండి వచ్చిన దాదాపు 9 లక్షల మందికి పైగా ఉన్న శరణార్థుల శిభిరాల్లో ఉద్రిక్త వాతావరణ నెలకొనడంతోనే ఈ హత్యలు జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడి జరిగినపుడు నలుగురు వెంటనే చనిపోగా మిగతా ముగ్గురు బాలుఖాలి క్యాంప్‌లోని ఆసుపత్రిలో మరణించారని అన్నారు. ఈ మేరకు దాడి జరిగిన వెంటనే ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు సాయుధ బలగాల బెటాలియన్ ప్రాంతీయ చీఫ్ శిహాబ్ కైసర్ ఖాన్ తెలిపారు.
(చదవండి: మోదీ జీ.. ప్రతిసారి నా కృత్రిమ కాలు తొలగించమంటున్నారు’)
Comments
Please login to add a commentAdd a comment