
న్యూఢిల్లీ : మయన్మార్ (బర్మా) దేశంలో మత పరమైన దాడులు ఎదుర్కొని, ఆ దేశ సైన్యం చేత తరిమివేయబడ్డ అమాయక ప్రజలు రోహింగ్యాలు. మన దేశానికి వలస వచ్చి వారు ఆశ్రయం పొందుతున్న ప్రాంతాలను సందర్శించి వారిపై ఒక నివేదిక తయారు చేయాల్సిందిగా సుప్రీం కోర్టు కేంద్రాన్ని, మరో మూడు రాష్ట్రాలను ఆదేశించింది. గతంలో రోహింగ్యాలు దేశంలోకి అక్రమంగా ప్రవేశించారని వారిని వెనక్కి పంపిస్తామని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు.
కానీ శరణార్థులగా వచ్చిన వారి విషయంలో అలా వ్యవహరించడం సరికాదంటూ కేంద్రానికి మోట్టికాయ వేసిన సుప్రీం కోర్టు ముందు వారిని అక్కున చేర్చుకుని తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా సూచించింది. అయితే మయన్మార్‌లో ఇంకా అక్కడి మైనారిటీలపై దాడులు జరుగుతునే ఉన్నాయి. భారతదేశానికి వేల సంఖ్యలో రోహింగ్యాలు వలస వచ్చారు. శరణార్థి శిబిరాలలో తలదాచుకుని కొంతమంది. చిన్న చిన్న గూడరాలు వేసుకుని కూలి పనులు చేసుకుని బతుకు సాగిస్తున్నారు. వారి జీవన స్థితిగతులు, ఉపాధి అవకాశాలను అంచనా వేసి వారిని తిరిగి వారి దేశానికి పంపాల లేదా అనే అంశాన్ని తేల్చనుంది ప్రభుత్వం.