కాక్స్ బజార్ : మయన్మార్ నుంచి ఇతర దేశాలకు వలస వెళ్లిన ఏడు లక్షల రోహింగ్యా ముస్లింలు తిరిగి స్వచ్ఛందంగా మయన్మార్ రావచ్చని ఈ దేశ జాతీయ భద్రత సలహాదారుడు థాంగ్ తన్ తెలిపారు. సింగపూర్‌లో జరుగుతున్న ప్రాంతీయ భద్రతాదళ సమావేశంలో థాంగ్ మాట్లాడుతూ.. ‘రోహింగ్యా ముస్లింలు స్వచ్ఛందంగా మయన్మార్ తిరిగి రావచ్చు. వారు మేం వస్తున్నాం అంటే మా దేశం వారికి స్వాగతం పలుకుతుంది. ఐక్యరాజ్యసమితి బాధ్యతలను కాపాడటానికి రఖైన్ రాష్ట్రంలో నివసిస్తున్న రోహింగ్యా ముస్లింలను తమ దేశానికి ఆహ్మానించాల్సిన అవసర ఉందని’ ఆయన పేర్కొన్నారు.
2017 నుంచి మయన్మార్‌లో నివసిస్తున్న రోహింగ్యా ముస్లింలను ఆ దేశ సైన్యం చిత్రహింసలకు గురిచేసిన విషయం తెలిసిందే. సైన్యం నుంచి తప్పించుకుని పారిపోయిన రోహింగ్యాలు ఎక్కువగా బంగ్లాదేశ్‌లో ఆశ్రయం పొందారు. బంగ్లాదేశ్‌లో ఆశ్రయం పొందుతున్న రోహింగ్యాలను మయన్మార్ రావటానికి వీలుగా యూఎన్‌ఓ రూపొందించిన అవగాహన పత్రంపై థాంగ్ తన్ సంతకం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment