సైన్యం అధీనంలో రఖీనే రాష్ట్రం
మాంగ్డా: మయన్మార్‌లోని రఖీనే రాష్ట్రం ఉగ్రదాడులతో దద్దరిల్లుతోంది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి దేశంలోని సరిహద్దు ప్రాంతాలపై తీవ్రవాదులు దాడులకు తెగబడుతున్నారు. ఈ దాడుల్లో 12 మంది భద్రతాదళ అధికారులు, 77 మంది మిలిటెంట్లు మరణించారు. అప్రమత్తమైన ప్రభుత్వం రాష్ట్రమంతటా ఎమర్జెన్సీని ప్రకటించింది. అరాకాన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ(ఎఆర్‌ఎస్‌ఏ) అనే ఉగ్రవాద సంస్థ దాడులకు పాల్పడినట్లు ఆర్మీ ప్రకటించింది.