మయన్మార్‌లో మారణకాండ | terror violence in Myanmar's Rakhine, several dead | Sakshi
Sakshi News home page

మయన్మార్‌లో మారణకాండ

Published Fri, Aug 25 2017 4:41 PM | Last Updated on Sun, Sep 17 2017 5:58 PM

మయన్మార్‌లో మారణకాండ

మయన్మార్‌లో మారణకాండ

- బంగ్లా సరిహద్దు రఖీనేలో తీవ్రవాదుల దాడి
- 70 మంది మృతి.. వందల మందికి గాయాలు


నెపిటా:
మయన్మార్‌లో మరోసారి రక్తపుటేరులు పారాయి. బంగ్లాదేశ్‌ సరిహద్దులోని రఖీనే రాష్ట్రంలో శుక్రవారం తెల్లవారుజామున తీవ్రవాదులు జరిపిన భీకర దాడుల్లో సుమారు 70 మంది ప్రాణాలు కోల్పోగా, వందలమంది గాయపడ్డారు. అప్రమత్తమైన ప్రభుత్వం రాష్ట్రమంతటా ఎమర్జెన్సీని ప్రకటించింది. క్షతగాత్రులకు సమీపంలోని ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.

కాగా, దాడికి పాల్పడింది రోహింగ్యా ముస్లిం(బెంగాలీ) తీవ్రవాదులేనని మయన్మార్‌ ఆర్మీ అధికారులు తెలిపారు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటిగంట సమయంలో బంగ్లా సరిహద్దులోని మంగ్‌టావ్‌ పోలీస్‌ స్టేషన్‌ను తీవ్రవాదులు పేల్చేశారని, అదే సమయంలో రఖినేలోని కొన్ని పోలీస్‌ స్టేషన్లు, ఆర్మీ క్యాంపులపైనా దాడులు జరిగాయని, మొత్తం 200 మంది తీవ్రవాదులు ఈ దాడుల్లో పాల్గొని ఉండొచ్చని భావిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇరువైపులా ప్రాణనష్టం జరిగిందని, కొందరు సాధారణ పౌరులు కూడా చనిపోయారని ఆర్మీ వర్గాలు చెప్పారు

దశాబ్ధాల వైరం: బంగ్లాదేశ్‌ సరిహద్దును ఆనుకుని ఉండే రఖీనే రాష్ట్రంలోకి రొహింగ్యా ముస్లింల వలసలు ఎక్కువ. దీంతో స్థానిక ప్రజలకు, వలసదారులకు మధ్య ఘర్షణలు జరిగేవి. ఒక దశలో రంగంలోకి దిగిన సైన్యం.. రోహింగ్యాలను తిరిగి బంగ్లాదేశ్‌లోకి వెళ్లగొట్టేయత్నం చేసింది. ఈ క్రమంలోనే ప్రారంభమైన హింసాయుత పోరాటం.. దశాబ్ధాలుగా కొనసాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement