మయన్మార్ రాజ్యాంగాన్ని మార్చాలి
- సూకీకి మద్దతు పలికిన ఒబామా
యాంగూన్: మయన్మార్ ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మయన్మార్‌ను కోరారు. ప్రతిపక్షనేత అంగ్‌సాన్ సూకీ అధ్యక్ష ఎన్నికలకు పోటీ చేసేలా దేశ రాజ్యాంగాన్ని మార్చాలన్నారు. ఈ విషయంలో సూకీకి మద్దతు పలుకుతున్నానన్నారు. శుక్రవారం ఒబామా యాంగూన్‌లో సూకీ నివాసంలో ఆమెతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 2011లో సైనిక పాలన ముగిశాక సంస్కరణల పేరుతో సమస్యలను సృష్టిస్తున్నారంటూ మయన్మార్‌ను హెచ్చరించారు. అంతకుముందు ఒబామా మయన్మార్ అధ్యక్షుడు థీన్ సీన్‌తో సమావేశమయ్యారు.