
2లక్షల 40 వేలు : మయన్మార్‌ను వీడిన చిన్నారులు
సాక్షి : మయన్మార్‌లో నెలకొన్న వివాద పరిస్థితుల నేపథ్యంలో భారీగా రోహింగ్యాలు బంగ్లా వలసబాట పట్టారు. గత మూడు వారాల్లోనే సుమారు 2 లక్షల 40 వేల మంది రోహింగ్యా చిన్నారులు బంగ్లాకు వలస వెళ్లినట్లు ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యూనిసెఫ్ ప్రకటించింది. మయన్మార్‌లో బౌద్ధులకు-రోహింగ్యాలకు మధ్య అత్యంత దారుణ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.
చిన్నారుల వలసలపై యూనిసెఫ్ అధికార ప్రతినిధి మారిక్సీ మెర్కాడో మాట్లాడుతూ.. ఇప్పటివరకూ 60 శాతం మంది రోహింగ్యాలు అంటే 3 లక్షల 91 వేల మంది వలస వెళ్లినట్లు చెప్పారు. ఇందులో ఏడాదిలోపు ఉన్న చిన్నారుల సంఖ్య 36 వేలు, అలాగే గర్భవతుల సంఖ్య 52 వేలు ఉందని మారిక్సీ అన్నారు.