న్యూఢిల్లీ: తూర్పు దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను పటిష్టం చేసుకోవడానికి భారత్ అనుసరిస్తున్న ‘యాక్ట్ ఈస్ట్’ విధానాన్ని బలోపేతం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం నుంచి పది రోజుల పాటు విదేశీ పర్యటన చేపట్టనున్నారు. మయన్మార్, ఆస్ట్రేలియా, ఫిజీల్లో సాగే ఈ పర్యటనలో ఆయన కీలక ప్రపంచ సదస్సుల్లో పాల్గొంటారు.
బ్రిస్సేన్‌లో జరిగే జీ-20 సదస్సులో.. నల్లధనంపై పోరులో అంతర్జాతీయ సహకార ఆవశ్యకతను ప్రముఖంగా ప్రస్తావిస్తానని మోదీ పర్యటన సందర్భంగా సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. జీ-20, ఆసియాన్-భారత్, తూర్పు ఆసియా సదస్సుల్లో ఆసియా, ఆఫ్రికా, యూరప్ తదితర ఖండాల దేశాలకు చెందిన 40 మంది నేతలను కలుసుకుంటారు.
నేటి నుంచి ప్రధాని విదేశీ పర్యటన
Published Tue, Nov 11 2014 6:05 AM | Last Updated on Thu, Oct 4 2018 6:57 PM
Advertisement
Advertisement