సౌదీ పురుషులు, పాక్ మహిళలు పెళ్లి చేసుకోవద్దు..
రియాద్: పాకిస్థాన్, బంగ్లాదేశ్, చాద్, మియన్మార్ మహిళలను సౌదీ అరేబియా పురుషులు వివాహమాడకూడదని నిషేధం విధించింది. బహిషృతులను సౌదీ పురుషులు పెళ్లి చేసుకోకూడదనే నిబంధనలో భాగంగా ఈ నిషేద ప్రకటన వెలువడింది. ప్రస్తుతం సౌదీ అరేబియాలో నాలుగు దేశాలకు చెందిన 5 లక్షల మంది మహిళలు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు.
విదేశీ మహిళలను పెళ్లి చేసుకునేందుకు తప్పనిసరిగా అనుమతి స్వీకరించాలని మెక్కా పోలీస్ డైరెక్టర్ అస్సాఫ్ ఆల్ ఖురేషి తెలిపారు. సౌదీ అరేబియాలో పెళ్లికి సంబంధించిన నిబంధనలను మరింత కఠినతరం చేశారు. పెళ్లికి దరఖాస్తు చేసుకునే వారు 25 సంవత్సరాలకు పైబడి ఉండాలని, స్థానిక అధికారుల నుంచి అనుమతి పత్రాలను స్వీకరించాలని పోలీసులు తెలిపారు. అయితే అధికారికంగా మాత్రం ఈ ప్రకటనకు ఆమోదం లభించలేదు.