
న్యూఢిల్లీ: ఆసియా జూనియర్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ క్రీడాకారుడు సూరావజ్జుల స్నేహిత్ మెరిశాడు. మయన్మార్‌లో ముగిసిన ఈ పోటీల్లో బాలుర డబుల్స్ విభాగంలో తన భాగస్వామి జీత్‌చంద్రతో కలిసి స్నేహిత్ కాంస్య పతకాన్ని సాధించాడు.
శనివారం జరిగిన సెమీఫైనల్లో స్నేహిత్–జీత్‌చంద్ర ద్వయం 3–11, 10–12, 7–11తో చోయి ఇన్‌హోయిక్–క్వాక్ యుబిన్ (దక్షిణ కొరియా) జోడీ చేతిలో ఓడి కాంస్య పతకం సాధించింది. ఇదే టోర్నీలో బాలుర డబుల్స్‌లో మానవ్ ఠక్కర్–మనుశ్ షా జంట, మిక్స్‌డ్ డబుల్స్‌లో మానవ్ ఠక్కర్–అర్చన కామత్ జోడీలకు కాంస్యాలు లభించాయి.