ఆ ప్రజా వనితకు దేశ అధ్యక్ష పదవి? | Reports hint Suu Kyi could become Myanmar president | Sakshi
Sakshi News home page

ఆ ప్రజా వనితకు దేశ అధ్యక్ష పదవి?

Published Mon, Feb 8 2016 4:11 PM | Last Updated on Sun, Sep 3 2017 5:11 PM

ఆ ప్రజా వనితకు దేశ అధ్యక్ష పదవి?

ఆ ప్రజా వనితకు దేశ అధ్యక్ష పదవి?

నెపిడా: మయన్మార్ ప్రజస్వామిక ప్రతీక అంగ్ సాన్ సూకి మయన్మార్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టేందుకు ముందడుగు పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అక్కడ ఆమెకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నట్లు రెండు వార్తా చానెళ్లు తెలిపిన కథనాలు స్పష్టం చేస్తున్నాయి. అంగ్ సాన్ సూకి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు రాజ్యాంగ పరంగా ఉన్న అడ్డంకిని తొలగించేందుకు అటు సూకి, ఆ దేశ మిలటరీ వర్గాల మధ్య సానుకూల చర్చలు జరిగినట్లు ఆ చానెళ్లు తెలిపాయి.

గత ఏడాది నవంబర్ 8న మయన్మార్ లో జరిగిన ఎన్నికల్లో సూకి పార్టీ నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసి (ఎన్‌ఎల్‌డీ) భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఆ దేశ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు సూకికి రాజ్యాంగపరంగా ఇబ్బంది కూడా ఉంది. ఆ రాజ్యాంగంలోని నిబంధన 59(ఎఫ్) విదేశీయులను భర్తగా చేసుకున్న ఓ వ్యక్తి అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు అనుమతించదు. సూకి భర్త ఓ బ్రిటన్ దేశానికి చెందిన వాడు. ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా. మయన్మార్లో ప్రజాస్వామ్య బద్ధంగా ఉద్యమించడంలో సూకిది కీలక పాత్ర. ఆమెను ఓ గొప్ప వ్యక్తిగా ఆ దేశ ప్రజలు భావిస్తారు.

కానీ, అలాంటి వ్యక్తికి తమను పాలించే అవకాశం లేకపోవడం కూడా అక్కడి ప్రజలకు తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ దేశ ఉన్నత మిలటరీ విభాగంతో గత కొద్ది రోజులుగా జరుపుతున్న చర్చలు సత్ఫలితాలు ఇస్తున్నాయని, రాజ్యాంగంలోని ఆ ఆర్టికల్ ను తొలగించేందుకు యోచన చేస్తున్నారని తెలిసింది. అయితే, సూకి అధ్యక్ష బాధ్యతల అంశంపై ఇప్పుడే అధికారికంగా ప్రకటన చేయడం తొందరపాటు చర్య అవుతుందని అక్కడి ఓ న్యాయ ప్రముఖుడు అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement