రోహింగ్యాలకు ఆహ్వానం..!
- తొలిసారి స్పందించిన మయన్మార్ ప్రభుత్వం
- రఖైనా ఘటనలపై విచారం వ్యక‍్తం చేసిన సూకీ
- అంతర్జాతీయ పరిశీలకులు ఎవరైనా రావచ్చు
- శాంతిని నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నాం
- జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఆంగ్‌సాన్‌సూకీ
- -మయన్మార్‌లో ప్రజాప్రభుత్వం ఏర్పడి 18 నెలలు. ఇన్నేళ్లుగా దేశంలో పేరుకుపోయిన అనేక సమస్యలను, సవాళ్లను మేం ఎదుర్కొంటున్నాం. చాలావాటిని పరిష్కరించగలిగాం.
- ప్రపంచమంతా రఖైనా రాష్ట్రంమీద దృష్టి పెట్టింది. మేం ధైర‍్యంగా చెబుతున్నాం. ఏవరైనా.. ఏ సంస్థ అయినా ఇక్కడకు వచ్చి పరిశీలించి నిజానిజాలు తెలుసుకోవచ్చు.
- మయన్మార్‌లో శాంతిని పునరుద్దరించేందుకు అన్ని రకాల చర‍్యలు తీసుకుంటున్నాం.
- రోహింగ్యాలపై జరిగిన దాడికి చాలా బాధపడుతున్నాం. ప్రభుత్వం రఖైనా రాష్ట్రంలో తిరిగి శాంతియుత పరిస్థితులు నెలకొల్పేందుకు కృషి చేస్తున్నాం.
యాంగాన్ : వలసవెళ్లిన శరణార్థులు తిరిగి దేశానికి రావచ్చని.. మయన్మార్ స్టేట్ కౌన్సెలర్ ఆంగ్‌సాన్ సూకీ మంగళవారం ప్రకటించారు. రోహింగ్యా ముస్లింలపై ఆగస్టు 25న జరిగిన దాడి తరువాత తొలిసారిగా ఆ దేశం స్పందించింది. ఉత్తర మయన్మార్‌లోని రఖైనా రాష్ట్రంలో జరిగిన విధ్వంసకాండ తరువాత 4 లక్షల 10 వేల మంది రోహింగ్యాలు సరిహద్దు దాటి ఇతర దేశాలకు వలస వెళ్లారు. దీనిపై తొలిసారి మయన్మార్ స్టేట్ కౌన్సెలర్ ఆంగ్‌సాన్ సూకీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
శరణార్థులుగా వెళ్లిన రోహింగ్యాలు తిరిగి దేశానికి రావచ్చు.. అందుకు సంబంధించిన ప్రక్రియను త్వరలతోనే చేపడతామని ఆమె స్పష్టం చేశారు. జాతినుద్దేశించిన సూకీ మాట్లాడుతూ.. మతపరమైన అంశాలతో మయన్మార్‌ను విభిజించాలని, ఒక జాతిని నిర్మూలించాలన్న లక్ష్యంతోనూ ప్రభుత్వం పనిచేయడం లేదని స్పష్టం చేశారు. ప్రజలంతా శాంతి, సౌఖ్యాలతో జీవించేందుకు ప్రభుత్వం అన్నిసౌకర్యాలను కల్పిస్తుందని చెప్పారు. రోహింగ్యాలపై జరిగిన దాడిపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటన జరగడం దురదృష్టకరమని.. దీనిపై ఎంతో మథనపడ్డానని చెప్పారు.
ఇది మంచిది కాదు
మయన్మార్‌లో జరిగిన మానవహక్కుల ఉల్లంఘన, హింసాత్మక పరిణామాలను సూకీ తీవ్రంగా ఖండించారు. మయన్మార్‌లో మళ్లీ శాంతియుత పరిస్థితులు నెలకొల్పేందుకు కృతనిశ్చయంతో పనిచేస్తున్నట్లు సూకీ వెల్లడించారు.
పరిస్థితులపై ఆరా
రోహింగ్యాలకు, ఇతర జాతులకు ఎందుకు విభేధాలు వచ్చాయి? రఖైనా రాష్ట్రంలో ఎందుకంత హింస చెలరేగింది? అంటి అంశాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి వివరాలు తెలుసుకుంటామని సూకీ వెల్లడించారు. రఖైనా రాష్ట్రంలో నివసిస్తున్న రోహింగ్యాల్లో మెజారిటీ ప్రజలు దేశం కోసం త్యాగాలు చేశారని సూకీ గుర్తు చేశారు.
అందరిదీ..!
మయన్మార్ అనేది ఏ ఒక్క మతానికి, జాతికో చెందిన దేశం కాదని.. అందరిదీ అని సూకీ చెప్పారు. బర్మా అనే దేశం ఏ అంతర్జాతీయ సమాజానికో, విచారణలకో భయపడదని సూకీ తెలిపారు.
ఎవరైనా రావచ్చు.. పరిశీలించవచ్చు!
మయన్మార్‌కు అంతర్జాతీయ పరిశీలకుడు, సంస్థలు రావచ్చని.. ఇక్కడి పరిస్థితులలు తెలుసుకోవచ్చని ప్రకటించారు.
సూకీ ప్రసంగంలో ముఖ్యాంశాలు