చైనా పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం మయన్మార్ చేరుకున్నారు.
మయన్మార్: చైనా పర్యటన ముగించుకుని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం మయన్మార్ చేరుకున్నారు. దేశ రాజధాని నెపిడా చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం లభించింది. నెపిడాలో కాలు పెట్టడంతో తన మయన్మార్ పర్యటన ప్రారంభమైందని ప్రధాని ఈ సందర్భంగా ట్విట్ చేశారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై ఆయన చర్చలు జరపనున్నారు.
మయన్మార్‌లో మోదీ మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మయన్మార్ అధ్యక్షుడు హ్యూటిన్ జా తో భేటీ కానున్నారు. బంగ్లాదేశ్ సరిహద్దు, మయన్మార్ పశ్చిమ ప్రాంతమైన రఖీనే రాష్ట్రంలో పెరుగుతున్న హింసాకాండపై ప్రధాని చర్చించనున్నారు. అలాగే మయన్మార్ నేత ఆంగ్ సాన్ సూకీతో భేటీ అవుతారు. కాగా బ్రిక్స్ దేశాల సదస్సుకు హాజరయ్యేందుకు మోదీ ఆదివారం చైనా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.