వాషింగ్టన్: భారత్ నేతృత్వంలో ఈ ఏడాది జరగనున్న క్వాడ్ దేశాధినేతల సదస్సుకు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ హాజరవుతారని వైట్‌హౌజ్ ప్రకటించింది. ఈ ఏడాది క్వాడ్ నేతల సదస్సుకు హాజరయ్యేందుకు తాము కట్టుబడి ఉన్నామని వైట్‌హౌజ్ నేషనల్ సెక్యూరిటీ కమ్యూనికేషన్ సలహాదారు జాన్ కిర్బీ తెలిపారు.
బైడెన్ ఈసారి అధ్యక్ష ఎన్నికల బరిలో నుంచి తప్పుకోవడంతో ఆయన షెడ్యూల్‌లో చాలా సమయం ఉందని చెప్పారు. 2020 నుంచి క్వాడ్ సదస్సులు వర్చువల్ విధానంలో జరుగుతున్నాయి. ఈ ఏడాది మాత్రం భారత్‌లో ప్రత్యక్షంగా నిర్వహించనున్నారు. ఈ ఏడాది జనవరి చివరివారంలో జరగాల్సిన క్వాడ్ సదస్సును భారత్ వాయిదా వేసింది. మళ్లీ ఎప్పుడు నిర్వహించేది ప్రకటించాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment