ఫ్రీచార్జ్ ఈ–వాలెట్ ప్రొటెక్షన్ ప్లాన్...
• వాలెట్ బ్యాలెన్స్‌పై రూ.20,000 వరకూ ఉచిత బీమా
• రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్‌తో జట్టు
న్యూఢిల్లీ: డిజిటల్ పేమెంట్స్ కంపెనీ ‘ఫ్రీచార్జ్’ తాజాగా తన యూజర్ల కోసం కొత్త ఈ–వాలెట్ ప్రొటెక్షన్ ప్లాన్‌ను ఆవిష్కరించింది. ఇందులో భాగంగా కస్టమర్లు/వ్యాపారులు వారి మొబైల్ ఫోన్‌ను పోగొట్టుకుంటే వాలెట్ బ్యాలెన్స్‌పై రూ.20,000 వరకూ ఉచిత బీమాను పొం దొచ్చు. ఇందుకు ఫ్రీచార్జ్.. రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ‘ఈ–వాలెట్ల వినియోగం, భద్రతకు సంబంధించి వినియోగదారుల్లో ఉన్న ఆందోళనలను పరిష్కరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం.
ఇది మొబైల్ ఫోన్ జారిపోయినప్పుడు కస్టమర్ల డబ్బుకు రక్షణ కల్పిస్తుంది’ అని కంపెనీ తెలిపింది. ఫోన్ పోయినప్పుడు కన్సూమర్ 24 గంటల లోపు పోలీసులకు ఫిర్యాదు చేసి, ఎఫ్‌ఐఆర్ నమోదు చేసుకోవాలని ఫ్రీచార్జ్ సీఈవో గోవింద్ రాజన్ పేర్కొన్నారు. అదేవిధంగా ఫ్రీచార్జ్‌కు ఈ–మెయిల్ లేదా కస్టమర్ కేర్‌కు కాల్ చేసి తెలియజేయాలని చెప్పారు. నెలలో కనీసం ఒకసారైన లావాదేవీ నిర్వహిస్తేనే బీమా వర్తిస్తుందని తెలిపారు.