అవంతీపురం(మిర్యాలగూడ క్రైం), న్యూస్‌లైన్: రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొని పది మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ ఘటన మిర్యాలగూడ మండలం అవంతీపురంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, ప్రయా ణికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మిర్యాలగూడ వైపు వస్తుండగా మణుగూరు డిపోనకు చెందిన బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మణుగూరు బస్సులో ఉన్న మండలంలోని ఏడు కోట్ల తండాకు చెందిన రంగమ్మ, శాంతి, శ్రీనివాస్‌నగర్‌కు చెందిన మాధవి, విజయలక్ష్మి, హైదలాపురానికి చెందిన యామినిలతో పాటు మరో ఐదుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని 108 వాహనంలో స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ పోలీస్‌స్టేషన్ సిబ్బంది తెలిపారు.
ఆటోబోల్తా.. ముగ్గురికి..
తోపుచర్ల (మిర్యాలగూడ): ఆటోబోల్తా పడడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన వేములపల్లి మండలం తోపుచర్ల గ్రామ పంచాయతీ పరిధి గండ్రవానిగూడెంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..తోపుచర్ల గ్రామ పంచాయతీ పరిధి సీత్యాతండాకు చెందిన భానావత్ రమేష్ ఆటోలో ఐదుగురు వ్యక్తులు ఇటీవల మహబుబ్‌నగర్ జిల్లా మద్దిమడుగు ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లారు.తిరుగు ప్రయాణంలో ఆటో గండ్రవానిగూడెం గ్రామ సమీపంలోకి రాగానే అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో సీత్యాతండాకు చెందిన డ్రైవర్ రమేష్, వాంకుడోతు గోపాల్, ధనావత్ హరిలకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వీరిని 108 వాహనంలో స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు.
రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. పదిమందికి గాయాలు
Published Thu, Dec 19 2013 4:06 AM | Last Updated on Sat, Sep 2 2017 1:45 AM
Advertisement
Advertisement