
సాక్షి, అమరావతి: దసరా పండుగ సందర్భంగా హైదరాబాద్‌తో సహా తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు నడుపుతున్న ఆర్టీసీ బస్సులకు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేఎస్‌బీ రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. 80 శాతానికిపైగా ఆక్యుపెన్సీ సాధిస్తున్నాయని, అయితే సాధారణ సర్వీసుల్లో ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయడం లేదని పేర్కొన్నారు.
కేవలం 16 దసరా ప్రత్యేక బస్సుల్లో మాత్రమే 50శాతం అదనపు చార్జీ వసూలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఉన్న అవగాహన ఒప్పందం మేరకు రెండు రాష్ట్రాల ఆర్టీసీ సంస్థలు బస్సులను నడుపుతున్నాయని వివరించారు.