
సాక్షి, అమరావతి: దసరా ఉత్సవాల్లో ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ సదుపాయాల కోసం ఆర్టీసీ పూర్తిస్థాయిలో సిద్ధమైంది. ఈ ఏడాది రికార్డుస్థాయిలో 4,485 దసరా ప్రత్యేక బస్సు సర్వీసులు నడపాలని నిర్ణయించింది. నవరాత్రుల సందర్భంగా దసరాకు వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు 2,100 ప్రత్యేక బస్ సర్వీసులు ఏర్పాటు చేస్తోంది.
దసరా అనంతరం తిరుగు ప్రయాణం కోసం 2,385 ప్రత్యేక బస్ సర్వీసులు నడపాలని నిర్ణయించింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి అత్యధికంగా హైదరాబాద్‌కు 2,290 బస్ సర్వీసులు ఏర్పాటు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment